క్రైమ్/లీగల్

భార్య చేతిలో భర్త దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతీపురం, మే 26: మండల కేంద్రంలో సూపర్ బజార్ నడుపుతున్న ప్రముఖ వ్యాపారి శివాజీ(39) దారుణ హత్య శనివారం ఉదయం మండలంలో తీవ్ర కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు స్థానికంగా కిరాణా టోకు వ్యాపారిగా పేరు గాంచిన శివాజీ 16 ఏళ్ల క్రితం రాళ్లబూదుగూరుకు చెందిన మాదవిరాణి(27)తో వివాహమైంది. వీరి అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు ఆడపిల్లలు కలిగారు. మగ సంతానం కలగలేదని తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. శుక్రవారం రాత్రికూడా భార్య భర్తల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగి మగబిడ్డ కోసం రెండోవివాహం చేసుకుంటానని శివాజీ తెగేసి చెప్పాడని, దీనికి తోడు మరో మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు మాదవి అనుమానం వ్యక్తం చేసిందన్నారు. అర్ధరాత్రి వరకు కొనసాగిన వీరి వివాదం పెద్దదై మాదవి కత్తితో భర్త శివాజీని విచక్షణా రహితంగా కోయడం, ఇనుప రాడ్డుతో కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం మాదవి బంధువుల సాయంతో రాళ్లబూదుగూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.