క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, మే 26 : మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామంలో లాలు (17) శనివారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వ్యవసాయ కూలీగా పనిచేసే లాలు పొలం పనుల నిమిత్తం గ్రామ సమీపంలోని తోటలో పని చేసేందుకు వెళ్లాడు. అయితే ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగి కిందపడిన విషయాన్ని గమనించని లాలు విద్యుత్ వైర్లపై కాలుపెట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.