క్రైమ్/లీగల్

కారులో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మే 25: పగటి ఉష్ణోగ్రతలు పెరడంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న కార్లలో మంటలు వ్యాపిస్తున్న సంఘటనలు రోజు ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ప్రయాణికులతో వెళ్తున్న ఓలా క్యాబ్‌లో మంటలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈసంఘటన రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని గచ్చిబౌలిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నారాయణగూడ విఠల్‌వాడిలో నివాసముండే పండరీనాథ్ ఓలా క్యాబ్ సర్వీస్‌లో తన ఇండికా కారును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్నం హాఫీజ్‌పేట నుండి టోలిచౌకి వైపు ఇద్దరు మహిళా ప్రయాణికులతో వెళ్తుండగా గచ్చిబౌలి కమిషనరేట్ వద్దకు వచ్చేసరికి కారు ఇంజన్‌లో మంటలు రావడం గమనించిన పండరీనాథ్ పక్కకు ఆపి మహిళలను కిందికి దింపేశాడు. మంటలు మరింత వ్యాపించడంతో ముందు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించి సమీపంలోని పెట్రోల్ పంపులో నుండి వాటర్ పైపు తెచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాడు. పది నిముషాల వ్యవధిలో కారు మొత్తం కాలిపోయింది. మంటలు ఆరిపోయిన తరువాత అగ్నిమాపక అధికారులు వచ్చి తిరిగి వెళ్లిపోయారు. రాయదుర్గం ఎస్‌ఐ కిషన్‌సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.