క్రైమ్/లీగల్

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 24: డ్రైవర్ నిర్లక్ష్యం డ్రైవింగ్ ఓ నిండు ప్రాణం తీసింది. వేగంగా వచ్చిన కంటైనర్ అదుపుతప్పి రింగ్‌రోడ్డులో పార్కుకు ఢీకొంది. భయంతో అక్కడ ఉన్న జనం పరుగులు తీయగా అదే సమయంలో రూ.5 భోజనం కోసం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జంగయ్య గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలో మరణించాడు. సుమారు 35ఏళ్ల వయస్సు కలిగి యున్న అతడు మధ్యాహ్నం రూ.5్భజనం కోసం వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మృత్యువు రూపంలో వచ్చిన కంటైనర్ ఢీ కొట్టడంతో ప్రాణాలు విడిచాడు. ఉప్పల్ రింగ్ రోడ్డు డేంజర్‌గా తయారైంది. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గ్రీన్ సిగ్నల్ వచ్చిన సమయంలో హబ్సిగూడ వైపు నుంచి వేగంగా వచ్చిన వాహనాలు అదే సమయంలో రోడ్డు దాటుతున్న పాదాచారులకు తగిలి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.