క్రైమ్/లీగల్

బ్యాంక్ ఆన్‌లైన్ మోసాలకు పోలీసుల చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 24: ఎట్టకేలకు వరంగల్ సైబర్ క్రైం పోలీసులు ఆన్‌లైన్ మోసాలకు చెక్‌పెట్టారు. వరంగల్ పోలీసు కమిషనరేట్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ నగరాల్లో బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల నుండి డబ్బులు ఆన్‌లైన్ ద్వారా చోరీకి పాల్పడుతున్న నిందితుడిని వరంగల్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. ఈమేరకు వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గుగులోత్ విజయ్ ప్రస్తుతం హైదరాబాద్ ఉప్పల్ బుద్దానగర్‌లో ఉంటున్నాడు. నిందితుడి నుండి దాదాపు 30లక్షల విలువ గల 240 గ్రాముల బంగారం, రెండు ఇంటి స్ధల దస్తావేజులు, ఒక ఐ 20 కారు, మరొక ద్విచక్రవాహనం, కెమరా, ఎల్‌ఇడి టెలివిజన్, 6సెల్ ఫోన్లు, 10కి పైగా వివిధ కంపినీల సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హైదరాబాద్‌లోని ఒక ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్ విభాగంలో బీటెక్ పూర్తి చేసాడు. భార్య, పిల్లలలో వివిధ కంపినీలలో ఉద్యోగం చేస్తు హైదరాబాద్‌లో ఉండేవాడు. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు తప్పుడు మార్గాలలో డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఒక రోజు హైదరాబాద్ బిగ్ బజారులో కొద్ది మంది వినియోగదారులు గిఫ్టుఓచర్ల ద్వార వస్తువులు కొనుగోలు చేస్తున్న తీరును గమనించి, వాటి గురించి ఇంటర్‌నెట్ ద్వార పలు వెబ్‌సైట్లలో విశే్లశించాడు. అందుకోసం సెల్ నెంబర్, జీమెయిల్ ఖాతా అవసరమని తెలుసుకొని తన దగ్గరి బంధువుల సహాయంతో తయారు చేసిన నకిలీ గుర్తింపు కార్డులపై వివిధ నెట్ వర్క్‌లకు చెందిన సిమ్ కార్డులను కొనుకోలు చేసి, వాటిపై జీమెయిల్ ఖాతాలు సృష్టించి నేరాలు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. ముందుగా తన వ్యక్తిగత డెబిట్ కార్డుద్వార బిగ్ బజారుకు సంబంధించిన గిఫ్టు ఓచర్లు కొనుగోలు చేసాడు. 2016లో తొలిసారిగా తాను నివాసం ఉండే బోడ ఉప్పల్ ప్రాంతంలో ఆంధ్రా బ్యాంక్, ఎస్‌బిఐ ఏటీఎం సెంటర్ల వద్దకు వెళ్లి ఏటిఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చిన బ్యాంకు ఖాతాదారులు డబ్బులు డ్రా చేసుకునే సమయంలో ఖాతాదారులకు తెలియకుండానే వారి ఏటిఎం కార్డు నెంబర్‌తో పాటు ఏటిఎం పిన్ నెంబర్‌ను దొంగచాటున చూసి తన సెల్ సెల్ ఫోన్‌లో నమోదు చేసుకునేవాడు. ఈవిధంగా నమోదు చేసుకున్న ఎటిఎం కార్డు, మరియు పిన్ నెంబర్లతో దగ్గర్లో ఉన్న ఇంటర్ నెట్ సెంటర్లకు వెళ్లి వివిధ వెబ్‌సైట్ల ద్వార వెయ్యి, రెండు వేల విలువ గల గిఫ్టు ఓచర్లు బుక్‌చేసే వాడు. ఈవిధంగా బుక్ చేసిన గిఫ్టు ఓచర్లతో నగరంలోని బిగ్ బజారు, జోయాలుకాస్, రిలయెన్స్, బజాజ్ ఎలక్ట్రానిక్ వంటి వాటిలో బంగారం, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను కొనుగోలు చేసేవాడు. అలా కొనుగోలు చేసిన బంగారం వస్తువులను తాకట్టుపెట్టి వచ్చిన డబ్బుతో స్వంతానికి వాడుకునే వాడని సీపి వెల్లడించారు. నిందితుడు వరంగల్‌లో 50కిపైగా ఖాతాల నుండి నేరాలకు పాల్పడ్డాడు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 500 ఖాతాదారుల నుండి గిఫ్టు ఓచర్లు బుక్ చేసాడు. వరుసగా జరుగుతున్న ఈతరహా మోసాలపై వరంగల్ ఎస్‌బిఐ బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీపీ రవీందర్ సైబర్ క్రైం పోలీసులను రంగంలోకి దింపారు. ఈసందర్భంగా సీపీ సైబర్ నేరగాన్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను సీపీ అభినందించారు.

చిత్రం..నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఖరీదైన వస్తువులు