క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో ఎక్సైజ్ సీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, మే 24: నల్లగొండ జిల్లా దేవరకొండ ఎక్సైజ్ సీఐ ఆర్ వెంకటేశ్వర్లు గురువారం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. గీత కార్మికుడు మారుపాకుల సురేశ్‌గౌడ్ నుండి తన కార్యాలయంలో రూ.9600 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బీ. కృష్ణగౌడ్ చెప్పిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన మారుపాకుల సురేశ్‌గౌడ్ అనే గీత కార్మికుడు నూతన గీత కార్మిక సొసైటీని ఏర్పాటు చేసేందుకు 24 మందితో ఎక్సైజ్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తును విచారణ చేసి నివేదికను సమర్పించాలని కమిషనర్ దేవరకొండ సీఐని ఆదేశించారు. దీంతో సీఐ వెంకటేశ్వర్లు ఈనెల 18వ తేదీన గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. 24 మంది గీతకార్మికులకు తాటి చెట్లు ఎక్కే పరీక్షను నిర్వహించగా ఇందులో కేవలం 12 మంది గీతకార్మికులు మాత్రమే తాటిచెట్లను ఎక్కారు. దీంతో ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపించాలంటే తనకు ఒక్కొక్కరూ రూ.వేయి చొప్పున రూ.12 వేలు ఇవ్వాలని సీఐ డిమాండ్ చేశారని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. చివరికి ఒక్కొక్కరూ రూ.800 చొప్పున లంచం ఇచ్చేందుకు అంగీకరించి సీఐతో ఒప్పందం కుదుర్చుకొ ని తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం లంచం డబ్బులు రూ.9600 ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ వెంకటేశ్వర్లుకు ఇస్తుండగా పక్కా ప్రణాళికతో పట్టుకున్నట్లు చెప్పారు. ఎక్సైజ్ సీఐని శుక్రవారం అవినీతి నిరోధక శాఖ కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు.