క్రైమ్/లీగల్

వక్కిలేరు కుంటలో పడి తల్లీకూతుళ్ల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుద్రవరం మే 22: మండలంలోని చిలుకలూరు గ్రామంలో బట్టలు ఉతికేందుకు వక్కిలేరు కుంట వద్దకు వెళ్లి కుటలో పడి తల్లీకూతురు మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. వేసవి సెలవులు కావడంతో చిలుకలూరుకు చెందిన చాంద్‌బీబీ ఇంటికి నంద్యాల పట్టణం, గుట్టవీధికి చెందిన ఆమె అక్క హుసేన్ భాను (43), ఆమె కుమార్తె హబిబూన్ (14) వారం రోజుల క్రితం వచ్చారు. మంగళవారం బట్టలు ఉతికేందుకు చాంద్‌బీబీతోపాటు అక్క హుసేన్‌భాను, కూతురు హబిబూన్‌లు ముగ్గురు కలిసి గ్రామ సమీపంలోని వక్కిలేరులోని నీటికుంట వద్దకు వెళ్లారు. అక్కడ బట్టలు ఉతుకుంటూ ప్రమాద వశాత్తు కాలుజారి హుసేన్‌భాను నీటి కుంటలో పడింది. గమనించిన కుమార్తె హబిబూన్ తల్లిని రక్షించేందుకు నీటి కుంటలోకి దిగింది. నీటిలో మునిగిపోతున్న తల్లీ కూతుళ్లను కాపాడేందుకు హుసేన్‌భాను చెల్లెలు చాంద్‌బీబీ కూడా నీటిలోకి దూకింది. దీంతో ముగ్గరికి ఈత రాకపోవడంతో నీటిలో పడి కేకలు వేస్తు కొట్టుకుంటుండగా చుట్టుపక్కల పంటపొలాల్లో ఉన్న స్థానికులు గుర్తించి కుంటవద్దకు పరుగులు తీశారు. నీటి కుంటలో మునిగిపోతున్న ముగ్గురిని బయటకు తీశారు. హుసేన్‌భాను ఆమె కుమార్తె హబిబూన్‌లు అప్పటికే మృతి చెందగా చాంద్‌బీబీ ప్రాణాలతో బయటపడింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటన స్థలానికి వెళ్లి కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక ఏఎస్‌ఐ రామయ్య, హెడ్‌కానిస్టేబుల్ గోపాల్‌రెడ్డిలు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. వీఆర్‌ఓ ఓబయ్య, బంధువుల ఫిర్యాదు మేరకు తల్లీకూతుళ్ల శవాలను పోస్టుమార్టం ఆళ్లగడ్డకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. కాగా నంద్యాల పట్టణం గట్టాల వీధికి చెందిన హుసేన్ భాను కూతురు హబిబూన్ నంద్యాలలోని ఎస్పీవైరెడ్డి పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. వేసవి సెలవులు కావడంతో తమ పిన్ని అయిన చాంద్‌బీబీ ఇంటికి వచ్చి మృత్యువాత పడడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.