క్రైమ్/లీగల్

మద్యం తాగి కారునడిపిన వ్యక్తికి ఏడురోజుల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, మే 21: మానకొండూర్ గ్రామానికి చెందిన దాసరి హరిష్ అనే యువకుడు మద్యం సేవించి కారునడుపుతు సోమవారం పోలీసులకు పట్టుబడ్డాడు. పట్టుబడిన కారుడ్రైవర్‌ను కోర్టులో స్ధానిక పోలీసులు హాజరుపరుచగా ఏడు రోజులు జైలు శిక్ష, 2వేల రూపాయాల జరిమానా విధించినట్లు సీఐ కోటేశ్వర్ తెలిపారు. యువకులు మద్యం తాగి వహనాలు నడపవద్దని సీఐ సూచించారు.

వడదెబ్బతో వృద్ధుడి మృతి
సైదాపూర్, మే 21: మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన కోహెడ వెంకటయ్య (80) అనే వృద్ధుడు వడదెబ్బ తగిలి సోమవారం మృతి చెందాడు. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోగా ఎండవేడిమికి తట్టుకోలేక అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

టాస్క్ఫోర్స్ మెరుపు దాడులు
ముకరంపుర కరీంనగర్, మే 21: కరీంనగర్ పట్టణంలో టాస్క్ఫోర్స్ పోలీసులు, గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు సంయుక్తంగా సోమవారం వివిధ దుకాణాలపై మెరుపుదాడులు చేశారు. విద్యానగర్‌లోని జిల్లా గణేష్‌కు సంబంధించిన ప్రసాద్ ఎంటర్‌ప్రైజెస్‌పై దాడి చేసి ఎలాంటి అనుమతులు లేకుండా నాసిరకం గరం మసాలాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పసుపు,కుంకుమ, కిస్‌మిస్, యాలకులు, ఖర్జూర వంటి పదార్థాలను పట్టుకొని పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అలాగే వంశీకృష్ణకు చెందిన వైష్ణవి డెయిరీ మిల్క్ పార్లర్‌పై దాడి నిర్వహించి పాడైన పన్నీర్‌ను స్వాధీనం చేసుకొని నాణ్యత ప్రమాణాలా పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సీఐ శ్రీనివాస రావు, మాదవి, ఎస్‌ఐ రమేష్, ఎఎస్‌ఐ నర్సయ్య, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్రనాథ్, పాల్గొన్నారు.