క్రైమ్/లీగల్

‘మత్తు’ విక్రేతల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, మే 21: నగర వ్యాప్తంగా నిషేధిత గుట్కా, ఖైనీ, గంజాయి విక్రయాలు ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగిపోవడంతో నగర పోలీసు కమిషనర్ ఆ దిశగా దృష్టి సారించారు. దీంతో నగర వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో నిషేధిత గుట్కా, ఖైనీ, గంజాయి విక్రయాల నిరోధానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సరుకు అమ్మడంతో పాటు అది ఎక్కడి నుండి వస్తుందనే కీలక వివరాల్ని సైతం తెలుసుకుని వాటి మూలాల్ని సమూలంగా పెకిలించేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు భారీగా గుట్కా, ఖైనీ, గంజాయి అమ్మకందారులు, సరఫరాదారుల్ని సోమవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డిప్యూటీ పోలీసు కమిషనర్ నవాబ్‌జాన్ నగరంలోని ఏఆర్ గ్రౌండ్‌లో విలేఖర్ల సమావేశం నిర్వహించి, నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పోలీసు కమిషనర్ ఆదేశాలతో పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఉండి గ్రామం, గుంటూరుజిల్లా వెంగళాయ పాలెంను కేంద్రంగా చేసుకుని వివిధ ప్రాంతాలకు గుట్కా, ఖైనీ, గంజాయిలను తరలిస్తున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు భారీగా సరుకు పట్టుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి అసలు సూత్రదారుల వివరాల్ని సేకరించి వారిని కూడా అరెస్టు చేశామన్నారు. అజిత్‌సింగ్‌నగర్ న్యూ అర్‌అర్ పేటలో ఏడుగురు నిందితులు, దేవీనగర్ రైల్వే ట్రాక్ సమీదంలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్దనుండి 88,674 గుట్కా, ఖైనీ ప్యాకెట్లను, వీటిని తయారు చేయడానికి వినియోగించే ముడి సరుకు, యంత్ర సామగ్రిని, 2,150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు. అరెస్టు అయిన వారిలో ఆర్‌ఆర్ పేటకు చెందిన షేక్ సైబీ, పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన కెల్లా రామారావు, ఇదే జిల్లా తాడేపల్లికి చెందిన చెర్లంచర్ల ప్రసాద్, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన మనె్నం శ్రీలేఖ, రాజమండ్రి మొవ్వ వీధికి చెందిన రాసంశెట్టి రమేష్, రాజమండ్రి మంగళవారి పేటకు చెందిన దాసరి పైడిరెడ్డి, రాజమండ్రి తిలక్‌రోడ్డుకు చెందిన దెంటకుర్తి సుబ్రహ్మణ్యం, గుంటూరుజిల్లా బోరింగ్ పంపు సెంటర్‌కు చెందిన పాలేటి గోపి, పాత గుంటూరు యాదవల బజార్‌కు చెందిన సంబూ వెంకట సుబ్రహ్మణ్యంలను అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా, బొలిశెట్టి కామేశ్వరరావు అలియాస్ కామేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నారని తెలియజేశారు. తమ విచారణలో పై నిందితులలో షేక్ సైబీ, మనె్నం శ్రీలేఖ విజయవాడలో కిరాణా షాపులను నడుపుతూ చట్ట వ్యతిరేకమైన గుట్కాలను గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి తయారీదారుల ద్వారా కొనుగోలు చేసి వాటిని విజయవాడలో విక్రయిస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలో షేక్ సైబీ పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన కెల్లా రామారావు, చెర్లంచర్ల ప్రసాద్ గుట్కాలను తయారు చేసి నగరానికి తీసుకువచ్చి షేక్ సైబీ ద్వారా వ్యాపారం చేస్తున్నారన్నారు. మనె్నం శ్రీలేఖ రాజమండ్రికి చెందిన పాలేటి గోపి, సంబూ వెంకట సుబ్రహ్మణ్యం, బోలిశెట్టి కామేశ్వరరావు అలియాస్ కామేష్‌లు కూడా విజయవాడ, దేవినగర్ రైల్వే ట్రాక్ సమీపంలో గుంటూరు, వెంగళాయపాలెం నుండి నేరుగా వారే గుట్కాలను తయారు చేసి తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో షేక్ సైబీ, మనె్నం శ్రీలేఖల సహకారంతో గుట్కా వ్యాపారాన్ని నగరానికి మార్చడానికి ప్రయత్నిస్తుండగా పోలీసువారికి వచ్చిన సమాచారం మేరకు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో దాడులు చేయగా పై నిందితులను సోమవారం అరెస్టు చేసి వారి వద్ద నుండి 88,674 గుట్కా ప్యాకెట్లను, గుట్కా తయారు చేయడానికి ఉపయోగించే ముడి సరుకు, యంత్ర సామగ్రిని, 2,150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీరితో పాటు కామేష్‌ను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ శ్రావణి, సీఐ జగన్మోహనరావు, ఎస్సైలు పాల్గొన్నారు.