క్రైమ్/లీగల్

తిరుపతిలో కొఠారిపురం విద్యార్ధి అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, మే 21: రాజాం మండలం కొఠారిపురం గ్రామానికి చెందిన కంతలి సురేష్ (17) అనే విద్యార్థి తిరుమల దేవాలయం క్యూ లైన్‌లో అదృశ్యమయ్యాడు. వివరాల్లోకి వెళితే ఇటీవల పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణుడైన సురేష్ మొక్కు చెల్లించుకొనేందుకు తమ బంధువులు నరసింహులు, చినమ్మడుతో తిరుపతి వెళ్లారు. ఆదివారం ఉదయం 11 గంటలకు విపరీతమైన రద్దీగా ఉన్న క్యూ లైన్‌లో బాత్‌రూమ్‌కు వెళ్లి ఆ తర్వాత కనిపించకపోవడంతో బంధువులు ఆందోళనతో కొఠారిపురంలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు సూర్యనారాయణ, పార్వతి కుమారుడి ఆచూకీ కోసం తిరుపతిలోని హెల్ప్‌లైన్‌ను సందర్శించగా, అన్ని కంపార్ట్‌మెంట్లు రద్దీగా ఉన్నందున పరిశీలన చేయడం కష్టమైనప్పటికీ ఆచూకీ తెలుసుకుంటామని హామీనిచ్చారు. అయితే బంధువులు మాత్రం భయంతో సోమవారం తిరుపతి ప్రయాణమయ్యారు. ఈ మేరకు రాజాం పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

గంజాయి స్వాధీనం
రాజాం, మే 21: రాజాం మండలం కంచరాం సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద సోమవారం తెల్లవారుజామున ఒడిశా వైపు నుంచి కారులో అక్రమంగా రవాణా చేస్తున్న 163 కేజీల 300 గ్రాముల గంజాయి పట్టుబడింది. గంజాయి విలువ రూ.6 లక్షల 52 వేలని అధికారులు అంచనా వేశారు. పోలీసులు అందించిన వివరాలు ప్రకారం దొంగలు, అపరిచితులు తిరుగుతున్నారనే సమాచారంపై పోలీసులు బీట్ పెంచిన తరుణంలో కంచరాం వైపు విధులు నిర్వహిస్తుండగా ఒడిశా నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొంది. పోలీసులు అప్రమత్తమై ప్రమాదం జరిగిందని భావించి కారును పరిశీలించగా కారులో ఉన్న వారు పరారీ కాగా గంజాయి ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. డిటి, వి ఆర్ ఒల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు రాజాం పోలీసులు తెలిపారు. అక్రమ రవాణాకు ఎవరు పాల్పడుతున్నది త్వరలో వెల్లడిస్తామని ఎస్ ఐ వి.సింహాచలం తెలిపారు.