క్రైమ్/లీగల్

వీడిన గర్భిణీ హత్య కేసు మిస్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఫిబ్రవరి 13: అక్రమ సంబంధంతో పాటు ఆర్థిక సమస్యలే గర్భిణి హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. నగరంలో తీవ్ర సంచలన సృష్టించిన మహిళను హత్య చేసి గోనె సంచిలో మూట కట్టి పడవేసిన కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. హత్యకు సంబంధించిన కేసులో ఇద్దరిని అరెస్టు చేయగా మరో ఇద్దరిని బీహార్‌లో అదుపులోకి తీసుకున్నామని కమిషనర్ సందీప్ శాం డిల్య తెలిపారు. మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో హత్య కేసుకి సంబంధించిన కేసు వివరాలను విలేఖరులకు వెల్లడించారు. బీహార్‌లోని బాంకా జిల్లా రాజౌన్ ఠాణాలోని మోహన మాలతి గ్రామానికి చెందిన మమత ఝా (37) ఆమె భర్త అనిల్ ఝా (75) కుమారుడు అమర్ కాంత్ ఝా (21) జీవనోపాధి కోసం నగరానికి వచ్చి సిద్ధిఖీనగర్‌లో ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికాస్ వీరి కుంటుంబంతో పరిచయం ఏర్పడి ఛాట్ బండార్ నిర్వహిస్తూ మమత ఇంట్లోనే ఉండేవాడు. వికాస్ అంతకుముందు రాజస్థాన్‌లో ఇటుకల బట్టీలో పనిచేశాడు. ఆ సమయంలో మృతురాలు తండ్రి దాబు లోయా కూడా అక్కడే పనిచేసేవాడు. వికాస్ ఇటుక బట్టీలో పనిచేస్తున్న సమయంలో దాబు లోయా భార్య తన కుమార్తె బింగీ అలియాస్ పింకీని తీసుకుని రాజస్థాన్‌కు వచ్చింది. 13 సంవత్సరాల క్రితమే బింగీకి బీహార్‌కు చెందిన దినేష్‌తో వివాహం జరిగింది. దేవ్ (10) జతిన్ (8) కుమార్తె నందిని (5) సంతానం. బింగీకి వికాస్ పరిచయం అయ్యాడు. కొన్నిరోజుల తరువాత వికాస్ తన మకాం రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు మార్చా డు. నగరానికి వచ్చిన తరువాత వికాస్‌కు మమత కుటుంబంతో పరిచయం ఏర్పడింది. సిద్ధిఖీనగర్‌లో ఇల్లు కిరాయికి తీసుకుంటున్న సమయంలో వికాసే తన భర్తని మమత నమ్మించింది. వికాస్ ఛాట్‌బండార్ నిర్వహిస్తుంటే మమత కుమారుడు అమర్ కాంత్ ఝా.. అంజయ్య నగర్‌లోని దిలాల్‌స్ట్రీట్ బార్‌లో వెయటర్‌గా పని చేస్తున్నాడు. 45 రోజుల క్రితం వికాస్ అడ్రసు తెలుసుకుని కుమారుడు జతిన్ (8)ను తీసుకుని సిద్ధిఖీ నగర్‌కు బింగీ వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఆమె బయటకు వెళ్లకుండా నిందితులు జాగ్రత్త పడ్డారు. బీహార్ నుంచి మమత వచ్చే సమయంలో వ్యవసాయ భూమిని గ్రామ పెద్ద వద్ద తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకుని నగరానికి వచ్చింది. చేసిన అప్పు తీరక పోవడంతో పాటు గర్భవతి అయిన బింగీ ఇంట్లో ఉండడంతో వికాస్‌తో ఉన్న అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని భావించి హత్య చేశారని సీపీ తెలిపారు. గత నెల 28న బింగీని హత్య చేసి నిందితులు ఒక రోజు మృతదేహన్ని ఇంట్లో ఉంచుకున్నారని వివరించారు. మమత కుమారుడు అమర్ కాంత్ కటర్‌ను కొనుగోలు చేసుకుని రాగా రాత్రివేళలో మృతదేహాన్ని ముక్కలుగా చేసి ప్లాస్టిక్, బియ్యం సంచుల్లో మూట కట్టుకుని తీసుకుని వచ్చి బొటానికిల్ గార్డెన్ వద్ద పడవేసి వెళ్లారని సీపీ తెలిపారు. వికాస్‌కు మోటార్ సైకిల్ నడపడం రాకపోవడంతో మృతదేహన్ని కుమారుడు అమర్ కాంత్‌తో కలిసి మమత తరలించింది. ఎలాంటి ఆధా రాలు లేకపోయినప్పటికి నిందితులను పట్టుకున్నామని సీపీ తెలిపారు. మోటారు సైకిల్ ఎలా వచ్చిందో పరిశీలించగా సిద్ధిఖీ నగర్ నుంచి టెక్ మహేంద్ర మీదిగా కొత్తగూడ, బొటానికల్ వైపు వచ్చినట్లు గుర్తించామని సందీప్ శాండిల్య తెలిపారు. పోలీసులు గాలిస్తున్నట్టు గ్రహించిన వికాస్ అదేరోజు బీహార్‌కు పారిపోయాడని చెప్పారు. 10న కార్డెన్ సెర్చ్ చేస్తున్న సమయంలో అమర్‌కాంత్ పరారైనట్టు చెప్పారు. పరారీలో ఉన్న వికాస్, అమర్‌ను బీహార్‌లో తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని, నగరానికి తీసుకొస్త్తున్నట్లు సీపీ వివరించారు. మమతను ఆమె భర్త అనిల్ ఝాను అరెస్టు చేసినట్లు సందీప్ శాండిల్య పేర్కొన్నారు. మృతురాలి కుమారుడు జతిన్‌ను హోంలో చేర్పించినట్లు పోలీసులు చెప్పారు. కేసులో ప్రధాన ముద్దాయి మమతేనని పేర్కొన్నారు. నిందితుల ఇంట్లో నుంచి కటర్, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. విలేఖరుల జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీం, అడ్మిన్ డీసీపీ అనసూయ, ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ దయానంద్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసా ద్ రావు, ఎస్‌ఓటీ సీఐ పురుషోత్తం, గచ్చిబౌలి సీఐ గంగాధర్ పాల్గొన్నారు.