క్రైమ్/లీగల్

అప్పులబాధతో యువరైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తంబళ్ళపల్లె, ఏప్రిల్ 26: అప్పుల బాధతో యువరైతు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సంబంధించిన వివరాలిలా వున్నాయి. తంబళ్ళపల్లె మండలంలోని గుండ్లపల్లె పంచాయతీ, చెట్లవారిపల్లెకు చెందిన యగారం పెద్దరెడ్డెప్ప(42) అప్పుల బాధతో బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం వద్దకు వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళి అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. టమోటా పంటలో తీవ్ర నష్టం వచ్చిందని, వెరుశెనగలో కూడా పూర్తిగా నష్టపోవడంతో రూ.4లక్షలు అప్పు ఉండడంతో తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య లక్ష్మిదేవి తెలిపారు. ఇతనికి కుమారుడు నిఖిల్(4), కుమార్తె మల్లిశ్వరి వివాహనం అయింది. ఇతని మృతితో చెట్లవారిపల్లెలో విషాదం నెలకొంది.