క్రైమ్/లీగల్

ప్రొఫెసర్‌పై ఎందుకంత ప్రేమ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై విద్యార్థులు ఫిర్యాదు చేసినా జవహార్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థినుల ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారంటూ వైఎస్ చాన్సలర్‌ను కోర్టు నిలదీసింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై సస్పెండైన ప్రొఫెసర్ అతుల్‌కుమార్ జోహ్రీపై ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారని న్యాయమూర్తి రాజీవ్ షాక్దెర్ ప్రశ్నించారు. జోహ్రీ క్యాంపస్‌కు రావడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జేఎన్‌యూ విద్యార్థినుల పిటిషన్‌ను బుధవారం విచారించిన కోర్టు ‘వర్శిటీ క్యాంప్‌స్‌లో విద్యార్థినుల భద్రతకు చర్యలు తీసుకోండి’అని ఆదేశించింది. ఈమేరకు వీసీ, ప్రొఫెసర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది.‘సస్పెండైన ప్రొఫెసర్ జోహ్రీని క్యాంపస్‌లోకి ఎలా రానిస్తున్నారు?. అతడిపై విచారణ పూర్తయ్యే వరకూ బయటే ఉండాలని మీరు చెప్పలేరా?’అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. విద్యార్థుల ఫిర్యాదుపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విద్యార్థినుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకోవాలని ఢిల్లీ పోలీసులకు కోర్టు సూచించింది. అలాగే విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, సత్వర న్యాయం పొందాలని జడ్జి విజ్ఞప్తి చేశారు. తమకు ఫిర్యాదు అందజేయందే ఏం చర్యలు తీసుకుంటామని జేఎన్‌యూ తరఫున న్యాయవాది గిన్ని రౌట్రే అన్నారు. ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు సంబంధించి పలువురు వర్శిటీ అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినట్టు విద్యార్థినుల తరఫున న్యాయవాది వ్రిందా గ్రోవెర్ కోర్టుకు తెలిపారు. సస్పెన్షన్‌లో ఉండి కూడా జోహ్రీ వర్శిటీ లైఫ్ సైనె్సస్ విభాగానికి రావడం, రికార్డులు చూడడం జరుగుతోందని ఆమె ఆరోపించారు.