క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన పెడన సబ్ రిజిస్ట్రార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన, ఏప్రిల్ 24: అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో అవినీతి చేపను పట్టుకున్నారు. వ్యవసాయ భూమి పార్టిషన్‌కు సంబంధించి రూ.53వేలు లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులు కృష్ణాజిల్లా పెడన సబ్‌రిజిస్ట్రార్ బి జగన్‌ను వల వేసి పట్టుకున్నారు. పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన మట్టా నరసింహరావు కుటుంబ సభ్యులకు సంబంధించి మూడు ఎకరాల 60 సెంట్ల వ్యవసాయ భూమిని పార్టిషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ జగన్‌ను సంప్రదించగా, అధికారిక ఖర్చులు పోను మరో రూ.53వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఏం చేయాలో పాలు పోని నరసింహరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రూ.53వేలు మొత్తాన్ని రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ జగన్‌కు అన్నీ తానై వ్యవహరిస్తూ అనధికారికంగా పని చేస్తున్న జన్నాబత్తుల వెంకట కృష్ణకు అందచేశాడు. సదరు మొత్తాన్ని తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి జగన్‌తో పాటు వెంకట కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలో లెక్క తెలియని మరో రూ.1.20లక్షలను కూడా సబ్ రిజిస్ట్రార్ నుండి ఎసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఎస్‌వివి ప్రసాద్ విలేఖర్లకు తెలిపారు. అలాగే మచిలీపట్నం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న జగన్ నివాసంలో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎసీబీ సీఐలు ఎస్ వెంకటేశ్వరరావు, కె వెంకటేశ్వరరావు, కృపావరం, రమేష్ బాబు పాల్గొన్నారు.