క్రైమ్/లీగల్

బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిపై పోక్సో కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచికచర్ల, డిసెంబర్ 14: మండలంలో గల పరిటాలలో బాలికపై అత్యాచారం జరిగింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం పరిటాలకు చెందిన తంగిరాల రాంబాబు (56) 14 ఏళ్ల బాలికపై సంవత్సర కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక తల్లికి బాలికపై అత్యాచారం చేసిన రాంబాబుతో అక్రమ సంబంధం ఉంది. పది సంవత్సరాల నుండి ఈ ఇద్దరికి సంబంధాలు ఉన్నాయి. సంవత్సరం క్రితం నుండి తల్లి మార్తమ్మ కూతూరుని బలవంతంగా తన ప్రియుడికి అప్పగించినట్లు నాయనమ్మ పోలీసులకు తెలిపింది. తల్లీబిడ్డలను అదే గ్రామంలో ఉన్న రాంబాబు బంధువు యద్దనపూడి ఏసమ్మ ఇంటికి తీసుకువెళ్లేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది గమనించిన నాయనమ్మ బాలికను ప్రశ్నించడంతో తన తల్లి చేస్తున్న వ్యవహారాన్ని బయటపెట్టడంతో శుక్రవారం రాత్రి బాలికతో కంచికచర్ల పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యాచారం చేసిన తంగిరాల రాంబాబు, బాలిక తల్లి మార్తమ్మ, రాంబాబు బంధువు ఏసమ్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందిగామ డీఎస్‌పి రమణమూర్తి, రూరల్ సిఐ సతీష్, ఎస్‌ఐ శ్రీహరి పరిటాల వెళ్లి విచారణ జరిపారు. నిందితులు ముగ్గురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.