క్రైమ్/లీగల్

తల్లిదండ్రుల వేధింపులు భరించలేక దత్తత బాలిక ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని టౌన్, డిసెంబర్ 3: దత్తత తీసుకున్న తల్లిదండ్రులు పెడుతున్న వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకొని సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో సంచలనం రేపింది. గోదావరిఖని అశోక్ నగర్‌లో నివాసముండే సల్లం సరోజ మల్లేష్ దంపతుల దత్త పుత్రిక సల్లం జ్యోతి (14) సోమవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సరోజ మల్లేష్ దంపతులు సంతానం లేక 2015లో హైదరాబాద్‌లోని డబ్ల్యూడి అండ్ సిహెచ్ నుంచి జ్యోతి అనే అమ్మాయిని 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు దత్తత తీసుకున్నారు. కాగా జ్యోతి ఎన్టీపీసీ కెవి స్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది. దత్తత తీసుకున్న నాటి నుంచి ఆమె తల్లిదండ్రులు వెట్టిచాకిరీ చేయించడం, దుర్భాషలాడటం, హింసించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని జ్యోతి తోటి స్నేహితులతో చెప్పుకుంటూ రోదించేది. వేధింపులు తాళలేక గతంలో ఒకసారి సీడీపీఓకు కూడా ఫిర్యాదు చేయగా, వారు ఆమె తల్లిదండ్రులకు కౌనె్సలింగ్ కూడా ఇచ్చారు. ఆ తరువాత కొన్నిరోజుల వరకు బాగానే చూసుకున్న తల్లిదండ్రుల మళ్లీ యథావిధిగా గతంలో లాగానే ప్రవర్తిస్తూ వచ్చారు. దీంతో వారి బాధను తట్టుకోలేక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా సంఘటనా స్థలాన్ని గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు పరిశీలించారు. ఆ డివిజన్ మాజీ కార్పొరేటర్ భర్త బాలసాని తిరుపతి గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ అనంతరం బాలిక మృతదేహాన్ని సిడిపిఓకు అప్పగించగా వారు కాలనీవాసులతో కలిసి దహన సంస్కారాలను నిర్వహించారు. కాగా, జ్యోతిది ఆత్మహత్య కాదని, వారి పెంపుడు తల్లిదండ్రులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పలు విద్యార్థి సంఘాలు ఆరోపించాయ.

*చిత్రం...చిన్నారి సల్లం జ్యోతి మృతదేహం