క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో మైనింగ్ ఏడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 3: జిల్లా మైనింగ్ అసిస్టెండ్ డైరక్టర్ శ్రీనివాస్ ఓ వ్యక్తి నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఘటన మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక మైనింగ్ కార్యాలయంలో నారాయణ అనే వ్యక్తి నుంచి ఏడీ శ్రీనివాస్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో అధికారుల బృందం జిల్లా మైనింగ్ కార్యాలయంపై దాడులు నిర్వహించి పట్టుకున్న ఘటన జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబందించిన వివరాలను డీఎస్పీ కృష్ణ గౌడ్ విలేఖరులకు వివరిస్తూ వెల్దండ మండలం శంకర్‌కొండ తండాలోని గున్యభక్తతండా నివాసి నారాయణ తన భూమిలోని 16 ఎకరాలలో క్రషర్‌మిషన్ ఏర్పాటు చేయుటకు మైనింగ్ కార్యాలయంలో నవంబర్ 10న దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అధికారుల సూచనల మేరకు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకున్న తరువాత నారాయణ మైనింగ్ శాఖ ఎడీ శ్రీనివాస్‌ను కలిసి తనకు అనుమతి ఇవ్వాలని కోరగా పలుమార్లు కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారని, నవంబర్ 28న మరోసారి కలిసినప్పుడు అనుమతి కోసం రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. ముందుగా ఎల్‌వోసీకోసం రూ.20 వేలు తహశీల్దార్‌కు ఇవ్వాల్సి ఉంటుందని, అందుకు ఆ డబ్బు తీసుకొని రావాలని చెప్పగా నారాయణ రూ.15వేలు ఇస్తానని చెప్పి ఏసీబీని ఆశ్రయించారని డీఎస్పీ తెలిపారు.
ఈ విషయాన్ని నిర్ధారించుకున్న తరువాత మంగళవారం తాము చెప్పినట్లుగా నారాయణ మైనింగ్ కార్యాలయంలో ఏడీ శ్రీనివాస్‌కు రూ.15వేలు ఇస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. పట్టుబడిన డబ్బులను స్వాదీనం చేసుకొని శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివిధ పనులకోసం ఎవ్వరైనా అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని, ఇందుకోసం 1064కు ఫిర్యాదు చేస్తే వివరాలను గోప్యంగా ఉంచుతామని, దీనిని వినియోగించుకోవాలన్నారు. ఈ దాడులలో డీఎస్పీతోపాటు ఎస్సైలు లింగస్వామి, ప్రవీణ్‌కుమార్‌తోపాటు ఏసీబీ సిబ్బంది ఉన్నారు.
*చిత్రాలు.. .. విలేఖరులతో మాట్లాడుతున్న ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్
* ఏసీబీ అధికారులకు పట్టుబడిన జిల్లా మైనింగ్ ఏడీ శ్రీనివాస్