క్రైమ్/లీగల్

ప్రాణహిత నదిలో గల్లంతైన అటవీ అధికారుల మృతదేహాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెజ్జూరు, డిసెంబర్ 2: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపెల్లి మండలం గూడెం ప్రాణహిత నదిలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ బీట్ అధికారుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. వివరాల్లోకి వెళితే ప్రాణహిత నదిలో పడవ మునిగి గల్లంతైన కేతిని బీట్ అధికారి బాలకృష్ణ, చిత్తాం బీట్ అధికారి సురేష్ కోసం ప్రాణహిత పరిసర ప్రాంతాల్లో అటవీ శాఖ, పోలీసు, మహారాష్ట్ర ఎన్‌డిఆర్ ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టడంతో బీట్ అధికారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అటవీ, పోలీసు అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టగా గూడెం ఓడరేవుకు కిలోమీటరు దూరంలో మృతదేహాలు లభించాయి. పడవ ప్రమాదంలో నలుగురు సురక్షితంగా బయటపడగా, ఇద్దరు బీట్ అధికారులు గల్లంతైన విషయం తెలిసిందే. పడవ ప్రమాదంలో ముగ్గురు బీట్ అధికారులు ఉండగా, శివపెల్లి బీట్ అధికారి సురక్షితంగా బయటపడగా, ఇద్దరు గల్లంతయ్యారు.
నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం
నాటు పడవ నడిపే వారి నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మద్యం సేవించి నాటు పడవలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని బీట్ అధికారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికందిన కుమారులు ఉద్యోగంలో చేరిన నాలుగు నెలల్లోనే ప్రాణహిత నది మింగేసిందని రోదించారు. సాధారణంగా ప్రతి రోజు గూడెం ప్రాణహిత ఓడరేవు నుండి తెలంగాణ ప్రజలు మహారాష్టల్రోని అహెరి, ఆళ్లపెల్లి తదితర ప్రాంతాలకు నిత్యం వందలాది మంది ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులను తరలించడానికి పెద్ద సైజులో ఉన్న పడవలకు ఆయిల్ ఇంజన్లను బిగిస్తూ పడవలు నడిపిస్తుంటారు. కానీ ఆదివారం జరిగిన ప్రమాదంలో చేపల వేటకు వెళ్లే పడవను ఉపయోగించడం వల్ల ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. తన కళ్ల ముందే తోటి బీట్ అధికారులు సురేష్, బాలకృష్ణ ప్రాణహితలో కలసిపోయారని శివపెల్లి బీట్ అధికారి సద్దాం కన్నీళ్ల పర్యంతమయ్యారు. ప్రాణహిత నది పరిసర ప్రాంతాల్లో బాలకృష్ణ, సురేష్ కుటుంబీకుల రోదనలు మిన్నంటిపోయాయి. గల్లంతైన బీట్ అధికారుల మృతదేహాలు లభించడంతో కౌటాల సీఐ శ్రీనివాస్, చింతలమానెపెల్లి ఎస్సై రామ్మోహన్ పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్‌టి సివిల్ ఆస్పత్రికి మృతదేహాలు తరలించారు. మృతదేహాలను సిర్పూర్ టి సివిల్ ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, జిల్లా ఎస్పీ మల్లారెడ్డి, డిఎఫ్‌ఓ రంజిత్ నాయక్, ఎఫ్‌బిఓ విజయ్‌కుమార్, ఎఫ్‌ఆర్‌ఓ వేణుగోపాల్ సందర్శించి కుటుంబీకులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.