క్రైమ్/లీగల్

కలకలం రేపిన బాలికల అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 1: తూర్పుగోదావరి జిల్లాలో శనివారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు అదృశ్యం కావడం కలకలం రేపింది. అర్ధరాత్రి సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు తెల్లవారుజామున వారి ఆచూకీ కనిపెట్టారు. వివరాల్లోకి వెళితే కాకినాడ నగరానికి చెందిన ఒక బాలిక ఇంటర్ ప్రధమ సంవత్సరం చదువుతోంది. శనివారం సాయంత్రం కళాశాల నుండి రావాల్సిన ఆమె రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వచ్చింది. దీంతో మానసిక వత్తిడికి గురైన తల్లి బాలికను తీవ్రస్థాయిలో మందలించింది. ఈ ఘటనతో ఇంటి నుండి బయటకు వచ్చిన బాలిక కొద్దిసేపటికి అదృశ్యమయ్యింది. ఆందోళనకు గురైన తల్లి చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. లారీ డ్రైవర్ అయిన భర్త ఇంకా ఇంటికి రావడంతో ఏమి చేయాలో పాలుపోని ఆమె హైదరాబాద్‌లో పెద్దకుమార్తెకు సమాచారం అందించింది. ఆమె ఫోన్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నరుూం అస్మీకి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఎస్పీ కాకినాడ డీఎస్పీ కరణం కుమార్‌ను అప్రమత్తం చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో కాకినాడ మూడో పట్టణ ఇన్స్‌పెక్టర్ సిహెచ్ శ్రీరామకోటేశ్వరరావు, రెండో పట్టణ ఇన్స్‌పెక్టర్ ఈశ్వరుడు పోలీసు బృందాలతో అర్ధరాత్రి గాలింపు మొదలుపెట్టారు. బాలిక స్నేహితుల వివరాలు సేకరించి ఒక్కొక్కరు ఇంటికి వెళ్లి సోదా చేశారు. ఈలోగా సీసీ టీవీ పుటేజీ సైతం సేకరించారు. ఒకొక్కరి నుండి వీలైనంత సమాచారాన్ని సేకరిస్తూ అర్ధరాత్రి దాదాపుగా కాకినాడ నగరాన్ని జల్లెడపట్టారు. చివరకు బాలికతో పదో తరగతి చదువుకుని ప్రస్తుతం డిప్లమో చేస్తున్న బాలుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు మరో స్నేహితుడి ఇంటి తలుపు తట్టారు. ఆ ఇంట్లో సురక్షితంగా నిద్రిస్తున్న బాలికను గుర్తించారు. ఏమి జరిగిందని వాకబు చేస్తే తల్లి మందలించాకా ఇంటి నుండి బయటకు వచ్చిన బాలిక నడుచుకుంటూ తన స్నేహితుడి ఇంటికి వెళ్లి తలుపు తట్టింది. తలుపు తీసిన స్నేహితుడి తండ్రి విషయమేమిటని ఆరా తీశాడు. ఇంటికి తీసుకెళ్లి అప్పగిస్తానని చెప్పాడు. అయితే తల్లికి భయపడిన బాలిక నిరాకరించడంతో ఉదయానే్న తీసుకువెళ్తానని చెప్పి తన ఇంట్లోనే ఇద్దరు కుమార్తెలతో కలసి పడుకోమని సూచించాడు. దాంతో ఆమె అక్కడే నిద్రించింది. హైదరాబాద్‌లో అర్ధరాత్రి మానవ మృగాల భారీన పడిన ప్రియాంకారెడ్డి విషాద ఘటన నేపధ్యంలో బాలిక అదృశ్యం ఘటన పోలీసులకు వెన్నులో చలి పుట్టించింది. అర్ధరాత్రి చలిని లెక్క చేయకుండా జరిపిన సెర్చ్ ఆపరేషన్ ఫలించి బాలిక సురక్షితంగా లభించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అర్ధరాత్రి వచ్చిన బాలికను సురక్షితంగా ఇంట్లోనే ఉంచిన రిక్షా కార్మికుడైన స్నేహితుడు తండ్రిని డీఎస్పీ కరణం కుమార్, ఇన్స్‌పెక్టర్ శ్రీరామకోటేశ్వరరావు అభినందించారు. బాలికకు, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.
మరో ఘటనలో మండపేట మండలం పెనికేరు గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక శనివారం కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. రాత్రి పది గంటల వరకూ వేచి చూసిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో అన్ని పోలీసు స్టేషన్‌ల సిబ్బంది అప్రమత్తమయ్యారు. సీసీ టీవీ పుటేజీలు, కాల్ ట్రేసింగ్ ఆధారంగా బాలిక గుంటూరు బస్టాండులో డార్మిటరీలో ఉన్నట్టు గుర్తించారు. ఎస్పీ నరుూం ఆస్మీ గుంటూరు జిల్లా పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు డార్మిటరీలో ఉన్న బాలికను, ఆమె స్నేహితుడిని పట్టుకున్నారు. వారిని కాకినాడ తీసుకురావడానికి ప్రత్యేక పోలీసు బృందం గుంటూరు బయలుదేరి వెళ్లింది. కాగా సకాలంలో స్పందించి ఇరువురు బాలికలను సురక్షితంగా రక్షించిన జిల్లా పోలీసులను ఎస్పీ నరుూం అస్మీ అభినందించారు.