క్రైమ్/లీగల్

ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, నవంబరు 28: నగ ర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు మద్యం సేవించి వాహనాల్ని నడుపుతు న్న వారిపై అటు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు, ఇటు నున్న గ్రామీణ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ను గురువారం నిర్వహించారు. అజిత్‌సింగ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని లోటస్ ప్రాంతంలోనూ, ను న్న గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలోని వాంబేకాలనీలోనూ సీఐలు లక్ష్మీనారాయణ, ప్రభాకరరావు నేతృత్వంలోని సిబ్బంది ఈ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాల్ని న డుపుతున్న వారిని గుర్తించి, వారితో బ్రీ త్ ఎనలైజింగ్ టెస్టు చేయించి, భారీగా కేసులు నమోదు చేశారు. మందుబాబుల వాహనాల్ని స్వాధీనం చేసుకున్నా రు. ఈ సందర్భంగా సీఐ లక్ష్మీనారాయ ణ, ప్రభాకరరావు మాట్లాడుతూ మ ద్యం సేవించి వాహనాలు నడపటం చ ట్టరీత్యా నేరమని, మద్యం సేవించి వా హనాలు నడిపే సమయంలో ప్రతి ఒ క్కరూ తమ కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. నిరంతరాయంగా ఈడ్రైవ్‌లు కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిమాన, జైలు శిక్ష పడతాయన్నారు.