క్రైమ్/లీగల్

షాద్‌నగర్‌లో వెటర్నరీ డాక్టర్ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్: షాద్‌నగర్ శివార్లలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. సంఘటన స్థలంలోని పరిస్థితులను బట్టి సజీవ దహనం చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. హత్య తర్వాత మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు దహనం చేసి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ దారుణమైన సంఘటన గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ శివారులోని 44వ జాతీయ రహదారి పక్కన గల చటాన్‌పల్లి అండర్ బ్రిడ్జి కింద వెలుగుచూసింది. పురపాలక సంఘం పరిధి చటాన్‌పల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై బైపాస్
రోడ్డు పక్కన ఉన్న బ్రిడ్జి కింద, సగం కాలిన స్థితిలో శంషాబాద్ నివాసి, పశువైద్యురాలు పోతుల ప్రియాంక రెడ్డి (26) మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లూరులో పశువుల డాక్టర్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం నర్సాయపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక కుటుంబం ప్రస్తుతం శంషాబాద్‌లో నివాసం ఉంటున్నది. ప్రియాంక బుధవారం కొల్లూరు పశువైద్యశాలలో విధులు నిర్వహించి సాయంత్రం ఇంటికి బయలుదేరి వెళ్లారని సిబ్బంది చెబుతున్నారు. శంషాబాద్‌లోని ఇంటికి చేరుకుని, గచ్చిబౌలి ఆసుపత్రికి వెళ్లివచ్చాక స్కూటీ పంచరైందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే పంచర్ చేసారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సంఘటన స్థలాన్ని శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రియాంక రెడ్డి రాత్రి 9 గంటలకు గచ్చిబౌలి నుంచి స్కూటీపై శంషాబాద్ టోల్‌గేటుకు చేరుకుంది. తొండుపల్లికి చేరుకోగానే ఆమె ప్రయాణిస్తున్న స్కూటీ పంచరైంది. అదే సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి పంచర్ చేయిస్తామని చెప్పారు. వ్యక్తులపై అనుమానం కలిగిన ప్రియాంక తన సోదరి భవ్యకు సెల్‌ఫోన్ ద్వారా భయమేస్తుందని సమాచారం అందచేసింది. ఆ తరువాత సెల్‌ఫోన్ స్విచ్చ్ఫా అయింది. ఉదయానికే ఈ దురాగతం వెలుగు చూసింది. కాగా, తొండుపల్లి టోల్‌గేటు పరిసరాల్లో సీసీ కెమెరాల పుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు, నిందితులను పట్టుకునేందుకు 15 బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటల తరువాత జరిగిన పరిణామాలు ఏమిటి? ఆ తరువాత షాద్‌నగర్ అండర్ బ్రిడ్జి దగ్గరకు ఎలా తీసుకువచ్చారు? అనే ప్రశ్నలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక్కడే సజీవ దహనం చేశారా? హత్య చేసి తగులబెట్టారా? లేదంటే మరోప్రాంతంలో హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి తగులబెట్టారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బ్రిడ్జి క్రింద మృతదేహం లభించడంతో రాత్రి ఏమి జరిగిందనే విషయంపై సంఘటన స్థలాన్ని సందర్శించిన శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ ఆరా తీసారు. సోదరి భవ్యతో సెల్‌ఫోన్ మాట్లాడిన తరువాత ఏమి జరిగి ఉంటుందనే విషయంపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. మృతురాలి సోదరి పోతుల భవ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును షాద్‌నగర్ పట్టణ సీఐ శ్రీ్ధర్ కుమార్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్‌టీం అణువణువునూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. ఘటన స్థలానికి ఎవరినీ రానీయకుండా, క్లూస్‌టీంతోపాటు డాగ్‌స్కాడ్‌లు పరిశీలిస్తున్నాయి. మృతదేహం చాలా వరకు తగలబడటంతో పోస్టుమార్టం ప్రక్రియను సంఘటన స్థలంలో నిర్వహించారు. షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రి డాక్టర్లు సురేందర్, మాధురి వచ్చి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని షాద్‌నగర్ పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
*పశువైద్యురాలు పోతుల ప్రియాంక రెడ్డి (ఫైల్‌ఫొటో)