క్రైమ్/లీగల్

42 ఏళ్ళ మహిళపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచి, నవంబర్ 27: పొట్ట కూటి కోసం అస్సాం నుంచి కొచికి వలస వచ్చిన కూలీ స్థానిక 42 ఏళ్ళ మహిళపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ‘పార’తో తలపై తీవ్రంగా గాయపరిచి హత్య చేశాడు. ముఃఖం గుర్తుపట్టరానంతగా పారతో కొట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా నిందితున్ని బుధవారం అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పెరుంబవూరుకు ఐదు కిలో మీటర్ల దూరంలోని కురుప్పాంపాడికి చెందిన 42 మహిళపై కూలి ఉమర్ అలీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. మంగళవారం అర్థరాత్రి దాటక, అంటే బుధవారం ఉదయం ఒంటి గంట ప్రాంతంలో ఈ అత్యాచార ఘటన జరిగింది. అక్కడి ఒక హోటల్‌కు సమీపంలో ఉన్న కొలను వద్ద రక్తపుమడుగులో వివస్తగ్రా పడి ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించాలనుకున్నారు. కాగా నిందితుడు చాలా తెలివిగా తాను చేసిన అత్యాచార ఘటనను ఓ ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది గమనించి దానిని ధ్వంసం చేశాడు. అయితే కొద్ది దూరంలో ఉన్న మరో సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలించగా, అస్పష్టంగా ఉన్నప్పటికీ, అలీ వెళ్ళిన మార్గం వైపు వెళుతూ, వరుసగా అన్ని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తూ అరెస్టు చేశారు. ఇటీవల మరో మహిళను ఇదేవిధంగా అత్యాచారానికి ఒడిగట్టి ఆ తర్వాత హత్య చేశాడు.