క్రైమ్/లీగల్

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ 15మంది మందుబాబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, నవంబరు 27: నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు మద్యం సేవించి వాహనాల్ని నడుపుతున్న వారిపై నున్న గ్రామీణ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ను బుధవారం రాత్రి వాంబే కాలనీ ప్రాంతంలో నిర్వహించారు. నున్న గ్రామీణ పోలీసు స్టేషన్ సీఐ ప్రభాకరరావు నేతృత్వంలో ఎస్సై, ఇతర సిబ్బంది ఈడ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాల్ని నడుపుతున్న వారిని గుర్తించి, వారికి బ్రీత్ ఎనలైజింగ్ టెస్టు నిర్వహించారు. వారిపై కేసులు నమోదు చేసి, వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ ప్రభాకరరావు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపటం చట్టరీత్యా నేరమని, ఇటువంటి సందర్భంలో మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, మద్యం సేవించిన వ్యక్తి ప్రమాదానికి గురైతే ఆవ్యక్తే కాకుండా అతని కుటుంబం కూడా రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. నిరంతరాయంగా ఈడ్రైవ్‌లు కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిమానా, జైలు శిక్ష పడతాయన్నారు.