క్రైమ్/లీగల్

సమ్మె చేసింది మీరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: యూనియన్లు, జేఏసీ పిలుపు మేరకే ఆర్టీ కార్మికులు సమ్మె చేశారని, ఇప్పుడు వారిని ఉద్యోగాల్లోకి తీసుకోమని ప్రభుత్వాన్ని ఏ క్లాజు కింద ఆదేశించగలమని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. సమ్మెకు యూనియనే్ల బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఇందులో ప్రభుత్వానికి ఏం సంబంధమని నిలదీసింది. ప్రభుత్వ వైఖరి కారణంగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు,
గుండెపోటుకు గురవుతున్నారని పిటిషనర్ తరఫున న్యాయవాది పేర్కొనగా, గుండెపోటుకు అనేక కారణాలుంటాయని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం కారణంగా గుండెపోటు వచ్చిందని చెప్పడానికి ఆధారాలు ఏం ఉన్నాయని హైకోర్టు అడిగింది. కార్మికులు సమ్మె వీడి డిపోలకు వెళ్లి ఉద్యోగాల్లో చేర్చుకోమని కోరుతుంటే అందుకు ఆర్టీసీ యాజమాన్యం నిరాకరిస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కోగా, ఈ అంశాలన్నింటిపైనా సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేసే ఆధారాలున్నాయా? అంటూ ఒక దశలో పిటిషనర్‌ను ప్రశ్నించింది. దాంతో ఆత్మహత్య చేసుకున్న కార్మికుల సూసైడ్ నోట్‌ను లాయరు కోర్టుముందుంచారు. పిటిషనర్ తరఫున అఫిడవిట్ దాఖలైన తర్వాత కోర్టు ఈ విచారణను కొనసాగిస్తుంది.