క్రైమ్/లీగల్
అబార్షన్లు చేస్తున్న ఆర్ఎంపీ అరెస్ట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కీసర, ఏప్రిల్ 17: కడుపులో ఆడ శిశువని తేలితే చాలు అబార్షన్లు చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్‌ను పోలీసు లు అదుపులోకి తీసుకున్న సంఘటన భోగారం గ్రామంలో చోటు చేసుకుం ది. వివరాల్లోకి వెళితే.. కీసర మండల ం, భోగారంలో దేవీ ఆసుపత్రి పేరుతో సుధాకర్ గౌడ్ ఆర్ఎంపీ డాక్టర్‌గా చలామణి అవుతున్నా డు. యాదాద్రి భవనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం మాదాపూర్‌లోని సూ ర్య ఆసుపత్రిలో డాక్టర్ నర్సింగ్‌రావు.. గర్భిణులకు లింగనిర్ధారణ చేసి ఆడశిశువని తెలిస్తే గుట్టుచప్పుడు కాకుం డా మేడ్చల్ జిల్లా కీసర మండలం భోగారంలోని దేవి ఆసుపత్రికి పంపిస్తాడు. ఇక్కడి డాక్టర్ సుధాకర్‌తో అబార్షన్లు చే యించి, భారీగా డబ్బులు వసూలు చేసేవారు. విషయం తెలుసుకున్న తుర్కపల్లి పోలీసులు.. సూర్య ఆసుపత్రిపై దాడులు చేసి, డాక్టర్ నర్సింగ్ రావును అదుపులోకి తీసుకొని విచారించారు. దేవి ఆసుపత్రి లో అబార్షన్లు చేస్తున్నట్లు తెలుపగా, దేవి ఆసుపత్రి నిర్వాహకుడు సుధాకర్‌గౌడ్‌ను తుర్కపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అబార్షన్ కేసులు నమోదయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.