క్రైమ్/లీగల్

చెరువులో మునిగి ఇద్దరు అయ్యప్పలు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి, నవంబర్ 11: విశాఖపట్నం జిల్లా, యలమంచిలి మున్సిపాలిటీ పరిధి, సైతారుపేట రోడ్డులో గల పెంజెరువు ఊబిలో చిక్కుకుని ఇద్దరు అయ్యప్పస్వాములు మృతి చెందారు. ఈ దుర్ఘటన సోమవారం సంభవించింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలివి. అచ్యుతాపురం మండలం భోగాపురంలో అయ్యప్పస్వామి పడిపూజ నిమిత్తం కలువ పువ్వులకు మాలధరించిన లాలం నరేష్(24), పైల గణేష్(21), తోటి స్వాములు పెంజెరువు వద్దకు వెళ్ళారు. నరేష్, గణేష్ చెరువులోకి దిగారు. చెరువులో ఊబి ఎక్కువగా ఉండడంతో మిగతా స్వాములు చూస్తూండడంగానే వీరిద్దరు మునిగిపోయారు. దీంతో ఒడ్డున ఉన్న రామసత్యం స్వామి భయంతో కేకలు వేయడంతో సమీపంలోని స్థానిక రైతులు కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే వారిద్దరు మృతి చెందారు. ఇద్దరూ ఊబిలో చిక్కుకోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండు గంటల పాటు శ్రమించి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. కాగా, లాలం నరేష్ అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లో అభిజిత్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మృతినికి తల్లి, తమ్ముడు ఉన్నారు. పైల గణేష్ ఎస్‌ఇజెడ్‌లో కంపెనీల్లో పనిచేసి ఆరు నెలలు కిందట మానేశాడు. గణేష్‌కు తల్లితండ్రులు, ఒక సోదరి ఉన్నారు. స్థానిక టౌన్ ఎస్‌ఐ నాగకార్తిక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.