క్రైమ్/లీగల్

కల్కి అక్రమాస్తులు రూ.500 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 18: కల్కి భగవాన్ ఆశ్రమంలో గత మూడు రోజులుగా కల్కి ఆశ్రమాలతో పాటు దాని అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో భారీఎత్తున విదేశీ వస్తువులు, వజ్రాలు, కేజీలకొద్దీ బంగారం, ఇతర విలువైన కీలకపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు గత మూడు రోజులుగా చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని ఆశ్రమ ప్రధానకార్యదర్శితో సహా చెన్నై, హైదరాబాద్, బెంగళూరుతో పాటు సుమారు నలభై చోట్ల ఏకకాలంలో దాడులు జరిపిన విషయం పాఠకులకు విదితమే. ఈ క్రమంలో ఆశ్రమానికి చెందిన వెల్‌నెస్ గ్రూపు భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి భిన్న ప్రచారాలు సాగుతున్నాయి. ఈక్రమంలో 18 కోట్ల రూపాయల విలువ చేసే అమెరికా డాలర్లతో పాటు 26 కోట్ల రూపాయల విలువ చేసే 85 కేజీల బంగారం, ఐదు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కాగా చైనా, అమెరికా, సింగపూర్, యుఏఈ వంటి దేశాలకు చెందిన పలు కంపెనీలలో వెల్‌నెస్ గ్రూపు ప్రపంచ వ్యాప్తంగా భారీ పెట్టుబడులు పెడుతూ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారుల సోదాలో వెలుగుచూశాయి. అయితే ఈ కంపెనీల నిర్వాహకులు ఆశ్రమానికి సంబంధించిన అనేక ప్రధానమైన కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఐటీ అధికారుల సోదాల్లో వెలుగుచూస్తున్నాయి. వీరి నుంచి విరాళాలు సేకరించిన ఆశ్రమ నిర్వాహకులు వాటిని దారి మళ్లించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు దొరికిన లెక్కలో లేని ఈ ఆస్తుల విలువ ఐదు వందల కోట్ల పైగానే ఉండవచ్చునని ఐటీ అధికారులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న కంపెనీలలో ఆశ్రమ నిర్వాహకులు ఏ మేరకు పెట్టుబడి పెట్టారన్నది ఐటీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తే వెలుగుచూసే అవకాశం ఉంది. తద్వారా భారతదేశం నుండి విదేశాలకు ఎంత మొత్తం బయటకు తరలివెళ్లిందనేది ఒక అంచనాకు రావచ్చునని అధికారులు భావిస్తున్నారు.