క్రైమ్/లీగల్

సెలవుల పొడిగింపుపై హైకోర్టులో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పాఠశాలలకు దసరా సెలవులు పొడిగించడాన్ని సవాలు చేస్తూ 8 ఏళ్ల విద్యార్థి అఖిల్ కాశిరెడ్డి, అతని తండ్రి శశిధర్ కాశిరెడ్డిల తరఫున సీ నరేష్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యాసంస్థల బంద్ అక్రమమని అఖిల్ పిటిషన్‌లో పేర్కొన్నాడు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నాడు. దసరా సెలవులు 11 రోజులు ఇచ్చారని, వాటిని మరో ఆరు రోజులు పెంచడం వల్ల విద్యార్థులు క్షోభకు, గందరగోళానికి గురవుతున్నారని పిటిషనర్ తెలిపాడు. ఆర్టీసీ సమ్మెతో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే సెలవులు పెంచామని ప్రభుత్వం చెబుతోందని, ఆర్టీసీ సమ్మె వల్ల ఎవరూ ఇబ్బంది పడటం లేదని, 70 శాతం బస్సులు నడుపుతున్నామంటూ మరో పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొందని పిటిషనర్ వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ధర్మాసనంలో బుధవారం నాడు వాదనలు కొనసాగనున్నాయి. కాగా, ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణ, టీవీవీ అధ్యక్షుడు మద్దిలేటి అరెస్టులపై వారి బంధువులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.