క్రైమ్/లీగల్

మసీదు నిర్మాణంలో వివాదం.. ఇరువర్గాల ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోనకల్, ఏప్రిల్ 16: మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామంలో మసీదు నిర్మాణ స్ధలం వివాదం మరల మొదలైంది. నిర్మాణం గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా జరుగుతున్నాయని కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికి ఎటువంటి నిర్మాణాలు జరుపవద్దని హైకోర్టు తీర్పు ఉన్నప్పటికి మసీదు నిర్మాణం జరుగుతుందని సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రదేశానికి వెళ్లగా ఇరువర్గాల మధ్య ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది. సిపిఎం, టిఆర్‌ఎస్ నాయకుల ఆధిపత్య పోరుతో మసీదు స్ధల వివాదం రచ్చకెక్కింది. సిపిఎం పార్టీ గ్రామ కంఠం భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్నా పంచాయతీ అనుమతి కావాలని గ్రామపంచాయతీ ఎటువంటి అనుమతులు ఇవ్వకపోయినప్పటికి ఎలా నిర్మాణాలు చేపడతారని వాదన వినిపిస్తుంది. ముస్లింలకు అధికార పార్టీ అండదండలు ఉండటంతో వారు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరుగుతుందని వారు వాపోతున్నారు. కోర్టు కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికి నిర్మాణాలు చేపడుతున్నారని స్ధానిక అధికారులకు, పోలీసులకు ముందే తెలియజేశామన్నారు. అయినప్పటికి అర్ధరాత్రి నిర్మాణాలు జరుపుతున్నారని వారు వాపోతున్నారు. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసుకున్నారు. తహశీల్దారు మాట్లాడుతూ ఆ స్థలం వివాదంలో ఉన్నందున ఎవరైన నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూమిని సర్వే చేసి అది ఎవరికి చెందినది నిర్ధారిస్తామన్నారు. సంఘటనా స్థలాన్ని జెడ్పీచైర్‌పర్సన్ గడిపల్లి కవిత సందర్శించారు.