క్రైమ్/లీగల్

చిచ్చురేపిన ప్రేమ పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోమకొండ, అక్టోబర్ 12: ఆ కుటుంబంలో ప్రేమ వివాహం చిచ్చురేపింది. అనంతరం ఇంట్లో మొదలైన గొడవలు ముగ్గురి హత్యలకు దారి తీసింది. ప్రేమించి పెళ్లాడిన అన్న కూతురు తోపాటు అన్నను, తన కూతుర్ని దారుణంగా హత్య చేశాడో దుండగుడు. ముందుగా కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగించి, అపస్మారక స్థితిలోకి వెళ్లాక బ్లేడుతో విచక్షణ రహితంగా దాడి చేసి చంపి పారిపోయా డా కిరాతకుడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని మల్లన్న గుడి సమీపంలోని జంగంపల్లిలో శనివారం జరిగిన ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. డిఎస్పీ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన పూర్వపారాలు ఇలా ఉన్నాయి. భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన బందేల బాలయ్య (42), అతని కూతురు లత (16), బాలయ్య తమ్ముని కూతురు చందన (5) అనే ఈ ముగ్గుర్ని పురు గుల మందు తాగించి హత్య చేశారు. శుక్రవారం సాయంత్రం హతుడి తమ్ముడైన రవి తన బైక్‌పై అన్నతో పాటు లత, చందనలను బయటకు తీసుకెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోయే సరికి వారి కుటుంబీకులు, బంధువులు ఆరా తీసి వెతికినా లభ్యం కాలేదు. శనివారం ఉదయం పొలం పనుల కోసం వెళ్లే రైతులు పొలాల పక్కన శవాలు పడి ఉండటం చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్‌ఐ రాజేశ్వర్‌గౌడ్ పోలీసులతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ పరిశీలించారు. హతుడైన బాలయ్యకు భార్య మణేమ్మ, ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారని, పెద్దకూతురు దీప, నెల రోజుల క్రితం వీరి కులానికి చెందిన నర్సింలు అనే వ్యక్తితో ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఇదే హత్యకు ఈ గొడవలు దారి తీశాయి. ఇంట్లో గొడవలు కావడంతోనే తన అన్నతో పాటు అన్న కూతురు, తన సొంత కూతురును తీసుకుని పోయి, దప్పిక అవుతుందని థమ్సప్‌లో పురుగుల మందును తెలియకుండా కలిపి తాగించాడు. వారు స్పృహ కోల్పోవడంతో బ్లేడ్‌తో గాయపరిచి చంపాడు. అనంతరం పారిపోయినట్లు డిఎస్పీ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, ఇతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. మృతుని భార్య మణేవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాలను కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించి పోసుమార్టం చేయించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉండగా నిందితున్ని పట్టుకునేందుకు పోలీసు జాగిలాన్ని రంగంలో దింపినట్లు డిఎస్పీ వెల్లడించారు. వీరి వెంట కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి భిక్కనూరు సీఐ రాజశేఖర్‌లు ఉన్నారు.
*చిత్రం...హత్యకు గురైన బాలయ్య, లత, చందన