క్రైమ్/లీగల్

నక్సలైట్ల సానుభూతిపరులంటూ ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, అక్టోబర్ 11: ఎన్నో ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న నడిగడ్డ ప్రాంతం మరోసారి రాష్ట్ర ప్రజానీకానికి తెలిసేటట్లు అయ్యింది. ముఖ్యంగా టీవీవీ నేత మద్దిలేటి, బలరాం, నాగన్న, జగన్‌లను గద్వాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారంతో నడిగడ్డలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గద్వాలటౌన్ పోలీసులు స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్ జగన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థి సంఘం నేతల అరెస్టు, ఎడిటర్ అరెస్టులతో ఈ ప్రాంత ప్రజలు, యువకులు మరోసారి నక్సలిజం గతంలో ఈ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లు ఇక్కడి నుండి వెళ్లిన కేంద్ర, రాష్ట్ర నాయకులను గుర్తు చేసుకుంటున్నారు. ఈ విషయంపై గద్వాల పోలీసులు ఏలాంటి సమాచారం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్ జగన్ సతీమణి, ప్రొఫెసర్ రజిని గద్వాలలో విలేఖరులతో మాట్లాడారు. జగన్ హైదరాబాద్ పీజీ కళాశాలలో ఎకనామిక్ ప్రొఫెసర్‌గా గత ఆరేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారని, తెలంగాణ ఉద్యమం రాకముందు నుండి పనె్నండేళ్లుగా స్టూడెంట్ మార్చ్ పత్రిక నడుపుతున్నారని, ఈ పత్రికలో తెలంగాణలో వస్తున్న సమస్యలు, సామాజిక అంశాలపై కథనాలు రాయడం జరుగుతుందన్నారు. ఈ మధ్య నల్లమలలో యూరేనియం తవ్వకాల అంశంపై ప్రత్యేక కథనాలు రాయడంతో పాటు మహబూబ్‌నగర్, గద్వాల, జడ్చర్లలో బాగా ప్రచారం జరగడంతో దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, మావోయిస్టులతో సంబంధం ఉందని, లేనిపోని ఆరోపణలు చేస్తూ బలవంతంగా అరెస్టు చేశారని వాపోయారు.