క్రైమ్/లీగల్

నిబ్బరంగా సీరియల్ కిల్లర్ జోలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోజికొడ్, అక్టోబర్ 11: అత్యంత అమానుష రీతిలో సొంత వారిని హతమార్చిన సీరియల్ కిల్లర్ జోలి జోసెఫ్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు సాక్షాల సేకరణ నిమిత్తం కోజికొడ్ జిల్లాలోని అనేక ప్రాంతాలకు శుక్రవారం తీసుకుని వెళ్ళారు. తనను చూసిన ప్రజలు అవహేళన చేసినా, దూషించినా జోలి జోసెఫ్ మాత్రం నిబ్బరాన్ని కోల్పోలేదు. జోలితో పాటు ఎంఎస్ మాథ్యూ, ప్రిజికుమార్‌లను ముందుగా మూడు మరణాలు సంభవించిన పొనామట్టిల్ ఇంటికి పోలీసులు తీసుకెళ్ళారు. ఈ ఇంట్లోనే విషాహారం తిని ఇక్కడే అన్నమ్మ (2002), టామ్ థామస్ (2008) అలాగే జోలె భర్త షాజు బంధువు రాయ్ తల్లిదండ్రులు మరణించారు. షాజు, జోలీల వివాహాం 2017లో జరిగింది. 2002 నుంచి 2016 సంవత్సరాల మధ్య ఈ హత్యలు జరిగాయి. రాయ్ సైనెడ్ కారణంగా మరణించినట్లు ఆయన మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించినప్పుడు స్పష్టమైంది. దీంతో ఎనిమిదేళ్ళ తర్వాత అక్టోబర్ 5న జోలిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాఉండగా పోలీసులు శుక్రవారం జోలిని, మాథ్యూ, ప్రిజిని విచారణ నిమిత్తం వివిధ ప్రాంతాలకు తీసుకెళ్ళారు. ఇందులో భాగంగా షాజు నివాసానికి, డెంటల్ క్లీనిక్‌కు తీసుకెళ్ళారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌కు ఆమెను తీసుకెళ్ళారు. తాను ‘నిట్’లో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నానంటూ తప్పుడు సమాచారంతో కాలం వెలిబుచ్చారు. వివిధ ప్రాంతాలకు ఆమెను తీసుకెళ్ళినప్పుడు అక్కడ గుమిగూడిన ప్రజలు జోలికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జోలి ఈ అకృత్యాలకు పాల్పడిందని తెలిసి తాము షాక్‌కు గురయ్యామని ఆమె నివసించే ప్రాంతంలోని ఇరుగుపొరుగు ప్రజలు వ్యాఖ్యానించారు. అందరితో మంచిగా కలిసి మెలిసి ఉండేదని, అయితే ఇన్ని హత్యలకు పాల్పడిన వార్త విని నమ్మలేక పోయామన్నారు. నిట్‌లో తాను లెక్చరర్‌నని జోలి చెప్పినట్లు వారు తెలిపారు. అమెరికాలో ఉంటున్న రాయ్ చిన్న తమ్ముడు రోజో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించడంతో డొంక కదిలి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.