క్రైమ్/లీగల్

గుట్టలు గుట్టలుగా గుట్కా నిల్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిహత్నూర్, అక్టోబర్ 10: కర్ణాటక కేంద్రంగా ఆదిలాబాద్ జిల్లాకు కంటైనర్‌లో భారీ మొత్తంలో అక్రమంగా రవాణా అవుతున్న గుట్కా నిల్వలపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించి స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.23లక్షల వరకు ఉంటుందని, బహిరంగ మార్కెట్‌లో దీని విలువ రెట్టింపు స్థాయిలో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈమేరకు గురువారం ఉట్నూరు డిఎస్పీ డేవిడ్ ఏసుదాసు వెల్లడించిన వివరాల ప్రకారం కర్ణాటకలోని బెంగుళూర్ కేంద్రంగా ఆదిలాబాద్ జిల్లాకు కొంత కాలంగా గుట్కా రాకెట్ భారీ మొత్తంలో సాగుతుందన్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఈమేరకు పోలీసులు వలపన్ని గుడిహత్నూర్ సమీపంలోని శర్మదాబ వద్ద జాతీయ రహదారిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా జవహార్‌నగర్ సమీపంలో పార్కింగ్‌లో ఉన్న కంటైనర్‌ను అనుమానంతో తనిఖీలు నిర్వహించగా 150 గన్ని సంచుల్లో అక్రమంగా రవాణా చేస్తున్న వి1 కంపెనీకి చెందిన గుట్కా ప్యాకెట్లు బయటపడినట్లు డి ఎస్పీ తెలిపారు. దీని విలువ సుమారు రూ.23లక్షలు ఉంటుందని, బయట మార్కెట్‌లో అక్రమంగా విక్రయిస్తే రూ.50లక్షల పైనే ధర పలుకుతుందన్నారు. ఈ గుట్కా రాకెట్ సూత్రదారులను కూపీ లాగగా నిందితులు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన అస్లాం సమీ ఉల్లాఖాన్ నకిలీ వేబిల్లులతో గుట్కా రాకెట్ నడిపిస్తున్నట్లు తేలిందని డిఎస్పీ తెలిపారు. బెంగుళూర్ నుండి భారీ మొత్తంలో గుట్కాను రవాణా చేస్తూ సునాయసంగా లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గుట్కాను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, ప్రధాన నిందితుడు సమీ ఉల్లాఖాన్‌తో పాటు కంటైనర్ డ్రైవర్ రియాజ్ ఆహ్మాద్ ఖాన్, శర్మదాబ యజమాని అనిల్ శర్మపై ఎస్పీ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఇచ్చోడ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్, ఏ ఎస్సైలు డేవిడ్, రెహ్మాన్ పాల్గొన్నారు.