క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన తహశీల్దార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజామల, అక్టోబర్ 10: ఓ రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకున్న కర్నూలు జిల్లా సంజామల తహశీల్దార్ గోవింద్ సింగ్ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి. సంజామల మండల పరిధిలోని రెడ్డిపల్లె గ్రామానికి చెందిన రైతు రమేష్‌రెడ్డి తనకు సంబంధించిన ఆల్వకొండ గ్రామ పొలాల్లోని సర్వే నెం.1216-1 పొలాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తహశీల్దార్ గోవింద్‌సింగ్‌ను కోరారు. తహసీల్దార్ కాలయాపన చేస్తూ వచ్చారు. రూ.5 వేలు ఇస్తేనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తానని ఖరాకండిగా చెప్పడంతో రమేశ్‌రెడ్డి సరేనని అంగీకరించి కర్నూలులోని ఏసీబీ డీఎస్పీ నాగభూషణంను కలిసి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు రమేష్‌రెడ్డి గురువారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో తహశీల్దార్ గోవింద్‌సింగ్‌కు అందజేశాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపి తహశీల్దార్ గోవింద్‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్‌ను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఏస్పీ నాగభూషణం తెలిపారు. ఈ దాడుల్లో సీఐ గౌతమి, సిబ్బంది పాల్గొన్నారు.