క్రైమ్/లీగల్

కోడెల ఆత్మహత్య కేసులో గుంటూరుకు హైదరాబాద్ పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి కోడెల కుమారుడు, కుమార్తెలను ప్రశ్నించేందుకు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు గుంటూరుకు వెళ్లనున్నారు. గతంలో కోడెల ఆత్మహత్య కేసుకు సంబంధించి ఆయన కుతురు, కుమారుడు విచారణకు హాజరుకావాలని ఇద్దరికి నోటీసులు పంపారు. ఈ విషయంలో వారివద్ద నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులు కొత్తరూట్‌ను ఎంచుకున్నారు. కోడెల కుమార్తె, కుమారుడిని ప్రశ్నించేందుకు సిద్దమవుతున్నారు. శివప్రసాదరావు మరణానికి కారణాలు, కాల్ డేటాతో పాటు మిగిలిన అంశాలపై వారి నుంచి సమాచారం సేకరించేందుకు పోలీసులు వారిద్దరిని గుంటొరులోనే ప్రశ్నించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు రెండు, మూడు రోజుల్లో గుంటూరుకు బయలుదేరనున్నారని విశ్వసనీయ సమాచారం.