క్రైమ్/లీగల్

గ్యాస్ ట్యాంకర్, లారీ ఢీ..ఇద్దరు విద్యార్థులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామభద్రపురం, అక్టోబర్ 6: విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ఆరికతోట జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం టీవీఎస్ ఎక్సెల్ బైక్‌పై వెళుతున్న ముగ్గురు విద్యార్థులను విశాఖపట్నం నుంచి ఒడిశా వైపు వెళుతున్న గ్యాస్ ట్యాంకర్ లారీ ఢీకొంది. ఈప్రమాదంలో మండలం నర్సాపురం గ్రామానికి చెందిన దత్తి ఈశ్వరరావు(17), గుణుపూరు హరిశ్చంద్రప్రసాద్(14) అక్కడికక్కడే మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన మరో విద్యార్థి ఈదుబిల్లి లోకేష్ తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. లోకేష్‌కు కుడి చేయి పూర్తిగా విరిగిపోవడమే కాకుండా శరీరమంతా తీవ్రగాయాలయ్యాయి. ఈమేరకు బాడంగి సిహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అందించి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల మృతదేహాలను బాడంగి సిహెచ్‌సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఎస్‌ఐ కృష్ణమూర్తి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ రహదారిపై మృతుల బంధువుల ఆందోళన
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల బంధువులు జాతీయ రహదారిపై 2గంటలపాటు ఆందోళన చేయడంతో సుమారు 5కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తీవ్రంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. విద్యార్థులను ఢీకొన్న లారీ కూడా సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో జాతీయ రహదారి పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. రోడ్డుపై ఉన్న మృతదేహాలను తరలించకుండా పోలీసులు అడ్డుకోవడంతో సాలూరు సీఐ సింహాద్రినాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల బంధువులు, గ్రామస్థులతో చర్చలు జరిపి శాంతింపచేశారు. అనంతరం మృతదేహాలను సిహెచ్‌సీకి తరలించే ఏర్పాట్లు చేశారు.
దసరాకు వచ్చి అనంత లోకాలకు..
మృతి చెందిన ఈశ్వరరావు విజయనగరం సమీపంలో గొట్లాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అలాగే గుణుపూరు హరిశ్చంద్రప్రసాద్ కూడా బొబ్బిలి అభ్యుదయ పాఠశాలలో 9వ తరగతి, తీవ్రంగా గాయపడిన లోకేష్ కూడా అభ్యుదయ పాఠశాలలోనే 8వ తరగతి చదువుతున్నాడు. దీంతో ఈ ప్రమాద ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి కారణమైన గ్యాస్ టాంకర్ లారీని పోలీసులు సాలూరులో పట్టుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జాతీయ రహదారి పూర్తిగా గోతులు, గుంతలమయం కావడంతో ఇటువంటి ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నా అధికారులు స్పందించక పోవడంపై ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
*చిత్రం... రోడ్డుపై పడి ఉన్న విద్యార్థుల మృతదేహాలు