క్రైమ్/లీగల్

శాస్తవ్రేత్తనని నమ్మించాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో శాస్తవ్రేత్తనని తనను నమ్మించి, వివాహం చేసుకున్నాడని భర్తపై ఓ భార్య కేసు పెట్టింది. పీహెచ్‌డీ చేస్తున్న ఆమె తన భర్త జితేందర్ ఇస్రోలో పనిచేస్తున్నట్టు వివాహానికి ముందు చెప్పాడని ఫిర్యాదులో పేర్కొంది. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి తాను ఎంటెక్ చదివానని తప్పుడు సర్ట్ఫికెట్లు చూపాడని ఆమె తెలిపింది. అదేవిధంగా ఇస్రోలో శాస్తవ్రేత్తగా పనిచేస్తున్నట్టు నకిలీ డాక్యుమెంట్లు చూపాడని ఆమె ఆరోపించింది. అయితే, నెట్‌ప్లిక్స్ అకౌంట్‌ను షేర్ చేయడంతో వాస్తవాలు బయటపడినట్టు పేర్కొంది. నిజానికి తన భర్త జితేందర్‌కు అంతకుముందే వివాహం జరిగినట్టు తెలిసిందని ఆమె వాపోయింది. మోసం చేసిన జితేందర్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది.