క్రైమ్/లీగల్

ఖైదీ నెంబర్ 4412

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం రాత్రి రవిప్రకాష్‌ను చంచల్‌గూడా జైలుకు తరలించగా, ఆయన్ను ఓ సాధారణ ఖైదీలా అధికారులు సింగిల్ బ్యారక్‌లో ఉంచారు. గత రాత్రి రవిప్రకాష్ నిద్రపోలేదని తెలిసింది. ఆదివారం ఉదయం ఆయనకు మిగతా ఖైదీలకు ఇచ్చినట్టుగానే కిచిడీని అల్పాహారంగా అందించగా, ఆయన దాన్ని అయిష్టంగానే తీసుకుని సరిగ్గా తినలేదని సమాచారం. రవిప్రకాష్‌కు అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ 4412ను కేటాయించి, కృష్ణా బ్యారక్‌లో ఉంచామని, ఆయన్ను చూసిన ఇతర ఖైదీలు మాట్లాడించాలని ప్రయత్నించినా, ముభావంగా ఉన్నాడని జైలు సిబ్బంది, అధికారులు తెలిపారు. కాగా, శనివారం న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ను విధించిన అనంతరం రాత్రి 10 గంటల ప్రాంతంలో రవిప్రకాష్‌ను ఏసీబీ అధికారులు జైలుకు తరలించిన విషయం విదితమే.