క్రైమ్/లీగల్

కిరాణాషాపులో రూ. 3లక్షల చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఏప్రిల్ 15: కిరాణ దుకాణం షట్టర్ పైభాగంలోని రేకుల ను తొలగించి క్యాష్ కౌంటర్‌లో ఉన్న మూడు లక్షల రూపాయలను చోరీ చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పో లీసులు, బాధితుని కథనం ప్రకారం.. మన్సూరాబాద్ శ్రీరామహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న రఘురామ య్య కాలనీలో శివ సాయి కిరాణ జనరల్ స్టోర్‌ను నడిపిస్తున్నాడు. శనివారం రాత్రి షాపునకు తాళాలు వేసాడు. ఆదివారం ఉదయం షాపు తెరవగా పైకప్పు భాగంలో రేకులు తొలగించినట్లు కనిపించింది. వెంటనే క్యాష్ కౌంటర్‌లో చూడగా అందులో ఉన్న మూడు లక్షల రూపాయలు చోరీ జరగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రెస్ కాలనీలో చోరీ
తాళాలు వేసి ఉన్న కిరాణ షాపు షట్టర్ తాళాలు పగలగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు 10 వేల రూపాయలు చోరీ చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సౌత్ ఎండ్ పార్కు కాలనీలో నివాసం ఉంటున్న పున్న మనోహర్ ప్రెస్‌కాలనీలో పల్లవి కిరాణ జనరల్ స్టోర్‌ను నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం షట్టర్‌లకు తాళం వేసి ఆదివారం ఉదయం తిరిగి షాపుతెరవడానికి రాగా అప్పటికే షట్టర్లు తెరచి ఉన్నాయి. క్యాష్ కౌంటర్‌లో ఉన్న 10వేల రూపాయలు చోరీ జరిగినట్లు గుర్తించి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ పుటేజీలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.