క్రైమ్/లీగల్

వృద్ధురాలి హత్య కేసులో నిందితుడు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, ఏప్రిల్ 15 : పట్టణంలోని ఇషాక్‌మియా వీధిలో నివాసం ఉంటున్న కోసూరి శైలరాణి తల్లి కోసూరి పద్మావతమ్మ (76)ను ఈ నెల 2వ తేదీన హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుచ్చి మండలం మనులపూడి గ్రామానికి చెందిన ఎస్‌కే రసూల్ (20) అనే యువకుడు వృద్ధురాలిని హత్య చేసి బీరువాలో ఉన్న 147 గ్రాముల బంగారం, రెండు ఫోన్లు, ఒక కెమేరాను చోరీ చేశాడు. ఈ సంఘటనపై ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డీఎస్పీ రఘు వివరాలు తెలిపారు. పట్టణంలోని ఇషాక్‌మియా వీధిలో నివాసం ఉంటున్న కోసూరి శైలారాణి గుడ్లూరు మండలం నరసాపురం గ్రామంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఆమె ఉంటున్న ఇంటిని రీమోడలింగ్ చేయించి ఈ నెల 1వ తేదీన గృహ ప్రవేశం ఉండటంతో సింగరాయకొండలో ఉంటున్న తల్లి కోసూరి పద్మావతమ్మ కావలికి వచ్చింది. గృహప్రవేశం అయిపోయిన వెంటనే బంధువులు అందరు వెళ్లిపోయారు. అనంతరం యధావిధిగా ఆమె తల్లి కోసూరి పద్మావతమ్మను ఇంట్లో ఉంచి ఆమె విధులకు వెళ్లిపోయింది. ఈ నెల 2వ తేదీన 10.30 గంటల సమయంలో తన తల్లితో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఎవరో ఒక అబ్బాయి వచ్చాడని, పేరు రసూల్ అని, ఈ ఇంటికి కబోర్డు పనిచేశానని, ఎలా ఉందో చూసి పోతానని చెప్తున్నాడని తెలిపిందన్నారు. సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి చేరుకుని తలుపు తట్టగా ఎంతసేపటికీ తలుపు తెరవకపోవడంతో వెనుకవైపు నుంచి వచ్చి చూడగా పూజగదిలో తల గోడకు ఆనించి నుదిటి మీద గాయంతో ఉండటాన్ని గమనించి స్థానికులను పిలిచినట్లు తెలిపారు. ఆమె చనిపోయిందని నిర్ధారించి వృద్ధాప్యంతో పాటు బీపీ వల్ల సాధారణ మరణంగా భావించి స్వగ్రామమైన సింగరాయకొండలో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఈ నెల 12వ తేదీన ఇంటికి బీరువాలో చూడగా బంగారం, కెమేరాలు కనిపించకపోవడంతో గతంలో కబోర్డుల పనిచేసిన రసూల్‌పై అనుమానంతో 1వ పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై సీఐ రోశయ్య, ఎస్సై అంకమ్మ వారి సిబ్బందితో ఆదివారం రసూల్‌ను పట్టుకుని అతని వద్ద ఉన్న 147 గ్రాముల బంగారం, కెమేరా, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతన్ని రిమాండ్‌లో ఉంచి కోర్టుకు హజరపరచనున్నట్లు తెలిపారు.