క్రైమ్/లీగల్

అనర్హులైనా పోటీకి అర్హులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కర్నాటక అసెంబ్లీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించినంత మాత్రాన వారికి రానున్న ఉపఎన్నికల్లో పోటీ చేసే హక్కు కాదని ఎన్నికల కమిషన్ సోమవారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. రాష్ట్రంలో 15 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగనున్న దృష్ట్యా అనర్హ ఎమ్మెల్యేలకు పోటీ చేసే అవకాశం లేదా అన్న అంశం రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో సీఈసీ సుప్రీంకోర్టుకు ఈ వివరణ ఇచ్చింది. రాష్ట్రంలో జరుగనున్న ఉపఎన్నికలపై స్టే ఇవ్వాలంటూ ఈ ఎమ్మెల్యేలు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు పరిశీంచేందుకు అంగీకరించింది. అయితే, వీటిని నిలిపివేయడానికి వీల్లేదని కూడా సుప్రీంకు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కాగా, ఇందుకు సంబంధించిన పిటిషన్లను ఈనెల 25న విచారిస్తామని న్యాయమూర్తులు ఎన్‌వీ రమణ, సంజీవ్ ఖన్నా, కృష్ణ మురారీతో కూడిన సుప్రీం ధర్మాసనం తెలిపింది. ‘ఈ ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. అసెంబ్లీ స్థానాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఉపఎన్నికలను నిలిపివేయడానికి వీల్లేదు’ అని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది సుప్రీం ధర్మాసనానికి నివేదించారు. అంతేకాదు, స్పీకర్ అనర్హత వేటు వేసినంత మాత్రాన ఈ ఎమ్మెల్యేలకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేకుండా పోయినట్టు కాదని తెలిపారు.