క్రైమ్/లీగల్

మునే్నటిలో యువకుడు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుగంచిప్రోలు, సెప్టెంబర్ 22: స్థానిక గోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఒక భక్తుడు మునే్నటిలో స్నానానికి దిగి ఆదివారం గల్లంతు అయ్యాడు. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా తెనాలి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన పఠాన్ గౌస్ (32) కొంత మంది స్నేహితులతో కలిసి ఆదివారం తిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చారు. అయితే స్నేహితులతో కలిసి మునే్నటిలో స్నానం చేసేందుకు దిగగా గౌస్ కొద్దిలోతులోకి వెళ్లడంతో కనిపించకుండా పోయాడు. దీనిపై స్నేహితులు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించగా వెంటనే జగ్గయ్యపేట సిఐ నాగేంద్రకుమార్, రెవెన్యూ అధికారులు గజ ఈతగాళ్లు, ప్రత్యేక బోట్ల ద్వారా మునే్నటిలో రాత్రి 8గంటల వరకూ గాలించినా గానీ గౌస్ ఆచూకి లభించలేదు. గల్లంతైన గౌస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.