క్రైమ్/లీగల్

కందరవాగులో లారీ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యాలవాడ, సెప్టెంబర్ 21: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మాయలూరు మధ్య కుందరవాగులో శనివారం తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. లారీలోని ముగ్గురిని పోలీసులు రక్షించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లారీ కోవెలకుంట్లకు వెళ్తూ మార్గమధ్యంలో కుందరవాగు దాటుతుండగా వరద తీవ్రతకు బోల్తాపడింది. దీంతో అందులోని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రఫీఉద్దీన్ మన్సూరి, వినోద్, మొహిముద్దీన్ ప్రాణభయంతో కేకలు వేయడంతో కొంతమంది యువకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్ల సాయంతో ముగ్గురిని రక్షించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
*చిత్రం... కుందరవాగులో బోల్తాపడిన లారీ