క్రైమ్/లీగల్

సీఐడీ అదనపు డీజీ కుమార్ ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత్తా, సెప్టెంబర్ 21: బహుళ కోట్ల రూపాయల గోల్‌మాల్ జరిగిన శారదా చిట్ ఫండ్ డిపాజిట్ల కుంభకోణం కేసులో నిందితుడైన పశ్చిమ బెంగాల్ అదనపు డీజీ రాజీవ్ కుమార్ కోసం సీబీఐ అధికారుల బృందం గాలింపు కొనసాగుతున్నది. రాజీవ్ కుమార్ కోసం చేపట్టిన అనే్వషణలో భాగంగా సీబీఐ అధికారులు శనివారం భవానీ భవన్‌లో ఉన్న సీఐడీ కార్యాలయానికి చేరుకుని ఆచూకి కోసం ఆరా తీశారు. శారదా చిట్ ఫండ్ డిపాజిట్ల కుంభకోణం కేసులో కీలకమైన సాక్ష్యాధారాలను రాజీవ్ కుమార్ అణచి వేశారన్నది అభియోగం.
ఇలాఉండగా సీబీఐ అధికారులు శుక్రవారం పార్క్ స్ట్రీట్‌లోని రాజీవ్ కుమార్ అధికార గృహానికి, దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉన్న రిసార్టుకూ వెళ్ళి ఆచూకి కోసం ప్రయత్నించారు. ఇలాఉండగా రాజీవ్ కుమార్ ఈ నెల 9 నుంచి 25వ తేదీ వరకు సెలవులో ఉన్నారని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ గత వారం సీబీఐ అధికారులకు తెలిపారు. శారదా చిట్ ఫండ్ కంపెనీ తమ కంపెనీలో పెట్టుబడలు పెడితే ఆ పెట్టుబడులకు పెద్ద మొత్తంలో తిరిగి చెల్లించనున్నట్లు నమ్మంచింది. దీంతో ప్రజలు పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేశారు. ఈ మేరకు డిపాజిట్‌దార్ల నుంచి రూ.2500 వరకు వసూలు చేసి వారిని బురిడీ కొట్టించింది. కాగా దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా సుప్రీం కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది.