క్రైమ్/లీగల్

భార్యను హతమార్చి పరారైన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, సెప్టెంబర్ 18: వరకట్నం కోసం భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. సేకరించిన వివరాల ప్రకారం స్థానిక నాగవరప్పాడులో నివాసముంటున్న పెదపూడి శ్రీకాంత్(26) టైల్స్ మేస్ర్తీగా పనిచేస్తున్నాడు. 2013వ సంవత్సరంలో బేబీ అనూషను పెద్దలకు తెలియకుండా ఎత్తుకెళ్ళి వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అనూష మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌పై అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు కొనసాగుతుండగానే 2017లో బేబీ అనూషను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఇటీవల బేబీ అనూష తండ్రి స్థిరాస్తిని విక్రయించగా కొంత నగదు వచ్చింది. ఈ నగదులో కట్నంగా వాటా తీసుకు రావాలని బేబీ అనూషను వేధిస్తూ వస్తున్నాడు. వరకట్నం వ్యవహారం శ్రీకాంత్, బేబీ అనూష మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మద్యం తాగి వచ్చిన శ్రీకాంత్ ఎప్పటిలాగే బేబీ అనూషతో గొడవపడ్డాడు. చున్నీతో మెడను లాగడంతో బేబీ అనూష మృతి చెందినట్టు తెలుస్తోంది. కొద్దిసేపటికి సమీపంలోని వారు వచ్చి బేబీ అనూషను పిలిచారు. ఇంట్లోనే ఉన్న శ్రీకాంత్ బేబీ అనూషకు అనారోగ్యంగా ఉందంటూ సమాధానం చెప్పి మళ్ళీ తలుపులు వేసుకున్నాడు. మరికొద్దిసేపటికి పక్కనే ఉంటున్న వృద్ధురాలు రాజేశ్వరి వచ్చి బేబీ అనూషను పిలిచింది. బయటకు వచ్చిన శ్రీకాంత్ ఫోన్లో మాట్లాడుకుంటూ బైక్ తీసుకుని అక్కడి నుండి పరారయ్యాడు. ఆమె ఇంట్లోకి వెళ్ళి చూడగా బేబీ అనూష విగత జీవిగా పడి ఉంది. వెంటనే సమాచారాన్ని వన్‌టౌన్ పోలీసులకు తెలియజేశారు. సీఐ వీ దుర్గారావు సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరగడానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుడివాడ డీఎస్పీ ఎన్ సత్యానందం ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.