క్రైమ్/లీగల్

బేసి - సరిపై పిటిషన్.. కొట్టివేసిన ఎన్‌జీటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల బేసి-సరి నెంబర్లు అమలుచేయాలన్న ఆప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌న నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్‌జీటీ) బుధవారం తోసిపుచ్చింది. నవంబర్ 4 నుంచి 15 వరకూ వాహనాలకు బేసి- సరి నెంబర్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వంతుల వారీగా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం ద్వారా వాయుకాలుష్యాన్ని నివారించవచ్చని భావించి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయవాది గౌరవ్ కుమార్ బన్సల్ ఎన్‌జీటీలో సవాల్ చేశారు. బేసి-సరి విధానానికి వాయు కాలుష్య నివారణకు సంబంధం లేదని, దానిపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని పిటిషనర్ ఆరోపించారు. బుధవారం బన్సల్ పిటిషన్‌ను విచారించిన ఎన్‌జీటీ చైర్‌పర్సన్ ఆదర్శ్ కుమార్ గోయెల్ ‘విచారణ అర్హతలేదు’అంటూ కొట్టివేశారు.