క్రైమ్/లీగల్

తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: అపార్టుమెంట్ నిర్మా ణం పేరుతో ఫ్లాట్ కొనుగోలుదారులను, తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు టోకరా వేసిన మోసగాడిని నగర సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సిసిఎస్ డిసిపి శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన బండి సుధాకర్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని కొత్తపేట ప్రాంతంలో ఉన్న శృంగేరి కాలనీలో మారుతి నిలయం పేరుతో నిర్మాణ కంపెనీని ప్రారంభించాడు.
ఆ అపార్టుమెంట్‌లో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారికి తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి రుణాలు ఇప్పిస్తామని చెప్పి ప్రోసెస్ చేసి వారి తరఫున బ్యాంకు నుంచి డిమాండ్ డ్రాఫ్ట్స్ తీసుకున్నాడు. కానీ ఇంతవరకు ఆ ఫ్లాట్లు పూర్తిగా నిర్మితం కాలేదు. ఇంతటితో ఆగకుండా అవే ఫ్లాట్లను మరొకరికి డబు ల్ రిజిష్ట్రేషన్ చేశాడు. ఆ సమయంలో అపార్టుమెం ట్ పేరు రాఘవేంద్ర రెసిడెన్సీ అపార్టుమెంట్స్‌గా మార్చి, మళ్లీ రుణాలు తీసుకున్నాడు. ఇలా బ్యాం కును, ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారిని మోసం చేశా డు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వెస్ట్‌మారేడ్ పల్లి బ్రాంచ్ మేనేజర్ ఆర్.సంగమేశ్వర్ రెడ్డి చేసిన ఫిర్యా దు మేరకు సిసిఎస్ పోలీసులు 2017 లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితుడిని అరెస్టుచేశారు.