క్రైమ్/లీగల్

విజయా బ్యాంక్ మేనేజర్‌కు జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 13: విజయవాడ ఏలూరు రోడ్డులోని విజయా బ్యాంక్ మేనేజర్, మరో ఎనిమిది మందికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ విశాఖలోని సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. బ్యాంక్ మేనేజర్ బండి బాబూరావు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పొట్లూరి శ్రీనివాసరావు, అనుముకొండ వీర వెంకట నారాయణరావు, నర్రా రఘుబాబు, డాక్టర్ చదలవాడ శ్రీరాణి, తన్నీరు శ్రీనివాసులు, చదలవాడ శ్రీనివాసరావు, కంభం పురాణ చంద్రరావు, చొల్లా వెంకట నాగేశ్వరరావుకు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలుశిక్ష, 1,08,000 రూపాయల జరిమానా విధించారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే, 2004-05లో బండి బాబూరావు విజయవాడ ఏలూరు రోడ్డులోని విజయా బ్యాంక్ మేనేజర్‌గా పని చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో 11 మందికి గృహ రుణాలు మంజూరు చేశారు.