క్రైమ్/లీగల్

ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 13: విశాఖ ఎయిర్‌పోర్టులో ఓ మహిళ నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ కమిషనర్ డాక్టర్ డీ.కే.శ్రీనివాస్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాంకాక్ నుంచి కౌలాలంపూర్ మీదుగా విశాఖ చేరుకున్న ఎయిర్ ఏషియా విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు ముందస్తు సమాచారాన్ని అందుకున్న కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె వద్ద నుంచి 410 గ్రామల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ 13,12,000 రూపాయలు. కేసు దర్యాప్తులో ఉందని శ్రీనివాస్ తెలిపారు.