క్రైమ్/లీగల్

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన సైకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవూరు, ఏప్రిల్ 13: నెల్లూరు జిల్లా కోవూరు పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా అత్యాచారాలు, దాడులు చేస్తూ జనాల కంటి మీద కునుకు లేకుండా చేసిన సైకోను ఎట్టకేలకు కోవూరు పోలీసులు గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం కోవూరు పోలీస్ స్టేషన్‌లో రూరల్ డిఎస్పీ వెంకటరాఘవరెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సైకోగా పేర్కొంటున్న సూరిబాబు(42) పాత నేరస్థుడని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటి వరకు 51 కేసులలో నిందితుడని చెప్పారు. కొన్ని కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడని తెలిపారు. నిందితుడు ప్రధానంగా ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను ఎంచుకుని వారిపై అత్యాచారం చేసి దొరికిన కాడికి దోచుకుని ఎదురుతిరిగితే హత్యచేసి పారిపోతాడన్నారు. అతను చేసిన అరాచకాలను బట్టి ఎస్‌పి ఆదేశాల మేరకు నమూనా చిత్రాన్ని రూపొందించి ఆ కోణంలో గాలింపు చేపట్టగా ఎట్టకేలకు సూరిబాబును పట్టుకోగలిగామన్నారు.